మళ్లీ పోటీకొచ్చిన చిరు.. టెక్షన్ పడుతున్న యంగ్ హీరోలు

0
512
chiranjeevi is in competation with young heros

Posted [relativedate]

chiranjeevi is in competation with young heros
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకి దాదాపు పదేళ్ల పాటు దూరంగా ఉన్నాడు. ఈ పదేళ్లలో సినీ పరిశ్రమలో ఎంతో మార్పు వచ్చింది. మెగా కాంపౌండ్ హీరోలతో సహా ఎంతో మంది యంగ్ కుర్రాళ్లు ఇండస్ట్రీకి వచ్చి హిట్స్ కొట్టారు. మరి కొంతమందైతే మాస్ హీరో అన్న ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నారు. వీళ్లల్లో నాని, రాజ్ తరుణ్, మంచు మనోజ్, విష్ణులతో పాటు మెగా హీరోలైన బన్నీ, సాయి ధరమ్ కూడా ఉన్నారు. వీళ్లంతా తమ హీరోయిజంతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీళ్లు హిట్స్ కొట్టినా, మాస్ హీరో ఇమేజ్ ని సాధించినా అదంతా చిరు సినిమా లేదన్నప్పడు అనేది గమనార్హం.

మరి ఇప్పుడు సీన్ మారింది. చిరు రాజకీయాల నుండి యూటర్న్ తీసుకుని సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చేశాడు. రీ ఎంట్రీ ఇవ్వడం కాదు ఖైదీ నెం. 150తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. దీంతో ఈ యంగ్ హీరోలందరూ కాస్త కంగారు పడుతున్నారట. ఇన్ని సంవత్సరాల నుండి తాము సంపాదించుకున్న ఇమేజ్… చిరు ఇమేజ్ ముందు వెలవెలబోతోందని వర్రీ అవుతున్నారట. చిరు నటించిన ఒక్క సినిమాతోనే తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని ఫీలవుతున్నారట. ఇక నుండి చిరు వరుస సినిమాలు చేస్తుండడంతో తమ ఇమేజ్ ఏమైపోతుందేమోనని కాస్త టెక్షన్ పడుతున్నారట.

గతంలో కూడా నాగ్, బాలయ్య, వెంకీ వంటి కో హీరోస్ కూడా చిరుతో పోటీకి రాలేకపోయారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఏమైనా ఈ వయసులో కూడా చిరు.. యంగ్ హీరోలకి పోటీ రావడం ఆశ్యర్యాన్ని కలిగించే విషయమే.

Leave a Reply