బాబుకి చిరుని అప్పగించిన జగన్?

 Posted October 28, 2016

chiranjeevi join tdp party because of jagan
మెగాస్టార్ చిరంజీవి టీడీపీలో చేరతారని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం సాగుతోంది.దాన్ని ఇప్పటిదాకా చిరు గానీ …దేశం వర్గాలు కానీ ఖండించలేదు.ఇదే నిజమైతే…చిరు టీడీపీలో చేరడం ఖాయమైతే అందుకు కారణం వైసీపీ అధినేత జగన్ అని అదే పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.ఎందుకని ప్రశ్నించినపుడు…అయన కొన్ని ఆసక్తికర సంగతులు వెల్లడించారు.ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపు ఉద్యమానికి మద్ధతివ్వాలని జగన్ నిర్ణయించారట. అయితే అప్పటికి చిరు కొత్త సినిమా ప్రయత్నాల్లో ఉండటంతో పాటు ..రాజకీయాల మీద నిరాసక్తంగా ఉన్నారట.ఇది గమనించిన జగన్ అండ్ కో చిరుని పిలిచి అయన రాలేదని ప్రచారం చేయదలిచారట.అయితే అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టు పద్మనాభం ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చారట చిరు ..చివరికి అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేసే దాసరి ఇంటికి కూడా చిరు వచ్చారు.కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకి తెలిసిన సలహాలు ఇచ్చారు.

దాసరి ఇంట్లో వరసగా జరిగిన సమావేశాల్లో ….రోజురోజుకి వైసీపీ నేతల సంఖ్య పెరగటం..చిరుకి ప్రాధాన్యం తగ్గడం కనిపిస్తూనే ఉందట.చిరుకి కూడా విషయం అర్ధమై చివర్లో ఆ సమావేశాలకు దూరంగా ఉన్నారంట.ఇదంతా ఓ వ్యూహం ప్రకారం జరిగిందని అనుమానిస్తున్న చిరు…వైసీపీ కి ఎట్టిపరిస్థితుల్లో బుద్ధి చెప్పాలని భావించే లోకేష్ ఆహ్వానాన్ని మన్నించినట్టు చెబుతున్నారు.ఇదంతా చూస్తుంటే జగన్ స్వయంగా చిరుని బాబుకి అప్పగించినట్టుందా? లేదా?

SHARE