Posted [relativedate]
మెగాస్టార్ చిరంజీవి ఇక బయట సినిమాలు చేయడం కష్టమేనా…? గీతా ఆర్ట్స్ కు కూడా ఛాన్స్ ఉండదా..? ఇకపై అన్నీ రాంచరణ్ ప్రొడక్షన్ లోనే ఉంటాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెంబర్-150 కి చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. కొత్తగా ప్రొడక్షన్ ను లాంఛ్ చేసి సినిమా తీశారు. హిట్ కొట్టారు. అంతేకాదు చిరు కొత్త సినిమాకు కూడా చెర్రీనే ప్రొడ్యూసర్ అని టాక్. ఈ విషయంలో మెగాస్టార్ గట్టి నిర్ణయమే తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
చెర్రీ ప్రొడక్షన్ వైపే చిరంజీవి మొగ్గు చూపడానికి అనేక కారణాలున్నాయి. చిరు సినిమా బడ్జెట్ కంటెంట్ ఏదైనా బడ్జెట్ మినిమం 50 కోట్లయినా ఉంటుంది. అంత ఖర్చు పెట్టాలంటే నిర్మాత ఆర్థికంగా చాలా గట్టివాడై ఉండాలి. తెలుగు ఇండస్ట్రీలో అంతటి బలమైన నిర్మాతలు ఈమధ్య తగ్గారు. ఈ మధ్య కొందరు పెద్ద సినిమాలు నిర్మిస్తున్నా… వారి ఆర్థిక పరిస్థితి మాత్రం ప్రశ్నార్థకమే. ఎందుకంటే ప్రొడ్యూసర్లు చాలామంది బయట నుంచి అప్పులు తీసుకొచ్చి సినిమాలు తీయడం కామనే. ఒకవేళ కర్మ కాలి… సినిమా బెడిసి కొట్టిందంటే ఆ ప్రొడ్యూసర్ కు చుక్కలే. ఒక్క సినిమాతో అంతా తలకిందులైపోతుంది. ఒకవేళ చిరు సినిమా తీసి… అది ఫెయిలైతే ఆ బ్యాడ్ నేమ్ మాత్రం చిరంజీవికి వస్తుంది.
సినిమా హిట్ కావడం.. కాకపోవడం ప్రేక్షకులను బట్టి ఉంటుంది. అందుకే తనకు తగ్గట్టుగా ఖర్చు పెట్టి… ఒకవేళ నష్టలొచ్చినా భరించగలిగే నిర్మాత అయితేనే బెటర్ అని చిరు భావిస్తున్నారట. ఎందుకంటే ఇప్పుడు తాను రాజకీయాల్లోనూ ఉన్నారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయి… నిర్మాత నష్టపోతే తనపేరు అనవసర వివాదాల్లోకి వచ్చే అవకశముంది. అందుకే ఇవన్నీ ఆలోచించే ఇక పర్మినెంట్ చెర్రీ ప్రొడక్షన్ లో నే సినిమా చేయాలని చిరు ఫిక్స్ అయిపోయారట. ఎందుకంటే ఒక నిర్మాతకు ఏమేం.. ఉండాలని తాను కోరుకుంటున్నారో.. ఆ అర్హతలన్నీ చెర్రీకి ఉన్నాయి. అన్నింటికి మించి చెర్రీ అయితే తనకు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఏది కావాలన్నా అది నిర్మొహమాటంగా అడగొచ్చు. కాబట్టే మెగాస్టార్ .. రాంచరణే ఉత్తమ నిర్మాత అని భావిస్తున్నారట. ఇకపై ఆయన ప్రొడక్షన్ లోనే నటించాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.