చిరంజీవి రాలేదు ..వైసీపీ హైజాక్ కారణమా?

Posted October 5, 2016

   chiranjeevi not attend kapu meeting because ycp leaders
ముద్రగడ కాపు ఉద్యమ కార్యాచరణపై జరిగిన తాజా సమావేశానికి చిరంజీవి రాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.ఇప్పటిదాకా హైదరాబాద్ లో జరిగిన అన్ని సమావేశాలకు అయన హాజరయ్యారు.చివరకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అర్ధమైన తరువాత కూడా దాసరి ఇంటికి వెళ్లారు.ముద్రగడకి ప్రతి అంశంలో అండగా ఉంటామని చెప్పారు. తాజా సమావేశానికి రాకపోవడానికి 150 వ సినిమా పనులు కారణం అని చెబుతున్నప్పటికీ కాదని తెలుస్తోంది. ఉద్యమం మొత్తం వైసీపీ కనుసన్నల్లో నడుస్తోందని చిరు ఓ అభిప్రాయానికి వచ్చారంట.

చిరు డౌట్ కి తగ్గట్టే నిన్నటి సమావేశంలోనూ వైసీపీ నేతలే ఎక్కువమంది వున్నారు.బొత్స,ఉమ్మారెడ్డి,అంబటి కీలక పాత్ర పోషించారు.ఇక ముద్రగడ,దాసరి వైసీపీ చెప్పినట్టల్లా చేస్తున్నారన్న విమర్శలు ఉండనే వున్నాయి.ఈ పరిస్థితుల్లో ఆ సమావేశాలకు వెళ్లి వైసీపీ చేతిలో పావులా మారడం ఇష్టం లేకే చిరు సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.మొత్తానికి వైసీపీ హైజాక్ తో చిరు ఆబ్సెంట్ అయ్యారన్నమాట.

SHARE