చిరుతో పవన్ ఏమి మాట్లాడారబ్బా?

 Posted November 3, 2016

chiranjeevi and pawan kalyan meet katamarayudu movie setఇద్దరు అన్నదమ్ములు..ఇద్దరు నటులు …ఓ చోట చేరడం…మాట్లాడుకోవడం సర్వసాధారణ అంశం.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరు,పవన్ సమావేశాన్ని అంత సాధారణంగా తీసుకోలేం.అందుకే దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది.మెగా అన్నదమ్ములిద్దరూ ఓ షూటింగ్ సందర్భంగా కలుసుకున్నారు.

ఖైదీ నెంబర్ 150 లో కొద్దిపాటి షూటింగ్ ని కాటమరాయుడు సెట్ లో తీశారు.అదే టైం లో చిరు,పవన్ ఓ గంట పాటు ముఖాముఖీ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఇద్దరు సినిమా సందర్భంలో కలిసినా రాజకీయాల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన దశలో వున్నారు.

అందుకే ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.చిరు టీడీపీ లో చేరతారని వార్తలు ఓ వైపు…రాజకీయ ప్రస్థానంలో ఏలూరుకు మజిలీ మార్చి జనసేన విస్తరణకు పవన్ మరో వైపు …ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో అని మెగా అభిమానులే కాదు రాష్ట్ర రాజకీయాల్ని ఆసక్తిగా పరిశీలించే వాళ్లంతా చర్చించుకున్న మాట .

SHARE