ఉయ్యాలవాడలో చిరు ఫస్ట్ లుక్?

Posted March 18, 2017

chiranjeevi uyyalawada narasimha reddy movie first lookఖైదీ నెం.150 సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇక మీద తాను వరుస సినిమాలు చేయనున్నాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే తన 151వసినిమాను మొదలుపెట్టేశాడు చిరు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ  సినిమాను చిరు  తనయుడు రామ్ చరణ్ తేజే  నిర్మించనున్నాడు.

అయితే ఉయ్యాలవాడ కధ ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం రెడీ చేసింది కావడంతో   చిరు కాస్త డిజప్పాంయింట్ అయ్యాడని, ఇప్పటి ట్రెండ్ కి తగ్గ విధంగా కధలో మార్పులు చేయమని చెప్పినట్లు ఇటీవల తెగ పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లన్నింటినీ కొట్టి పారేస్తూ చిరు సినిమాను ఏప్రిల్ నుండి ప్రారంభించనున్నాడు అని మెగాకాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్  సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఫస్ట్ లుక్ ఇదేనంటూ ఓ పోస్టర్  తెగ షేర్ అవుతోంది. గొడ్డలి, టైటిల్‌ లోగోతో  ఫుల్ యాక్షన్ సినిమాలా చాలా పవర్‌ ఫుల్‌ గా ఉంది ఆ పోస్టర్‌. అయితే ఆ పోస్టర్ పై నిర్మాత కానీ, దర్శకుడు కానీ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. త్వరగా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి,  చిరు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తే కానీ ఇటువంటి రూమర్లకు చెక్ పడదు అని అభిమానులు భావిస్తున్నారు.

SHARE