చిరు ఉయ్యాలవాడ లుక్ ఇదేనా?

  Posted March 22, 2017

chiranjeevi-uyyalawada-narasimha-reddy-movie-new-look-releaseమెగాస్టార్ చిరంజీవి తన  150వ సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాయడంతో అభిమానులు చిరు 151 సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఆసక్తికి తగిన విథంగానే చిరు  151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్రను చేస్తున్నాడన్న విషయం అఫీషియల్ గా కన్ఫామ్ అయ్యింది.  పరుచూరి బ్రదర్స్‌ రెడీ చేసిన ఈ కధకు దర్శకుడు సురేందర్ రెడ్డి తుది మెరుగులు దిద్దుతున్నాడు. రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్ నిర్మించబోయే  ఈ చిత్రం వచ్చే నెల నుండి సెట్స్ మీదకి  కూడా వెళ్లనుంది. కాగా రీసెంట్ గా ఉయ్యాలవాడ సినిమాలో చిరు ఫస్ట్ లుక్ ఇదనేంటూ ఓ పోస్టర్  చక్కర్లు కొట్టింది. గొడ్డలి, టైటిల్‌ లోగోతో ఫుల్ యాక్షన్ సినిమాలా చాలా పవర్‌ ఫుల్‌ గా ఉంది ఆ పోస్టర్. అయితే తాజాగా చిరు మరో లుక్ తెరపైకి వచ్చింది.  మరి ఈ లుక్ అయినా నిజమో కాదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

SHARE