చిరంజీవి హిట్లర్ అయితే ఆమె హిట్లరమ్మ..

0
565

  chirnajeevi nick name radha motherమామూలుగా గతంలో హీరోయిన్ల వెంట ఎప్పుడూ వాళ్ల తల్లులు వుండేవారు. షూటింగులో వాళ్లకి వారే బాడీగార్డులన్నట్లు కనిపించేవారు. కథానాయికను ఏం అడగాలన్నా ముందు అమ్మనే అడగాలి. ఆమె ద్వారానే హీరోయిన్ ని అప్రోచ్ అవాలి. అలాగే నిన్నటితరం కథానాయిక రాధ తల్లి సరసమ్మ కూడా కూతురు వెంట వుండేవారట. ఈవిడ స్ట్రిక్ట్ మనిషి. దీంతో ఆమెకు మెగాస్టార్ చిరంజీవి సరదాగా ‘హిట్లరమ్మ’ అంటూ ఓ నిక్ నేమ్ పెట్టారట. ఈ విషయాన్ని తాజాగా రాధ వెల్లడించింది.

అప్పటి విషయాలను గుర్తుచేసుకుంటూ “ప్రతి సినిమా షూటింగుకి నా వెంట మా అమ్మ వచ్చేది. ఆవిడ కాస్త స్ట్రిక్ట్. దాంతో చిరంజీవిగారు అమ్మకు హిట్లరమ్మ అని సరదాగా పేరు పెట్టారు. నిక్ నేమ్ పెట్టినంత మాత్రాన వాళ్ల మధ్య అసంతృప్తుల్లాంటివి లేవు. అమ్మంటే ఆయనకు చాలా గౌరవం. అలాగే అమ్మ కూడా ఆయనను ఎంతగానో అభిమానించేది. ఇద్దరూ బాగా మాట్లాడుకునేవారు కూడా” అంటూ చెప్పుకొచ్చారు రాధ. చిరంజీవిని తాను మొదటిసారిగా ‘గూండా’ సినిమా సెట్లో కలిశానని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి-రాధలది అప్పట్లో పెద్ద హిట్ పెయిర్. ఈ జంట డ్యాన్స్ చేస్తే కనులపంటగా వుండేది. వీరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలున్నాయి.

Leave a Reply