పుట్టిన రోజున బయటకు వస్తున్నకత్తి..

0
471

  chiru 150 movie name reveals chiru birthday

కొన్నేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాదే తన 150వ సినిమాకు శ్రీకారం చుట్టేశాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ప్రారంభోత్సవం తర్వాత రెగ్యులర్ షూటింగ్ విషయంలో కొంత సస్పెన్స్ నడిచింది కానీ.. ఎట్టకేలకు గత నెలలోనే అది కూడా మొదలైపోయింది. పని మొదలయ్యాక విరామం లేకుండా షెడ్యూళ్లు కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం దాకా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన తొలి విశేషాన్ని అభిమానులతో పంచుకోవడానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు నాడు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

ఇందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ కూడా చేస్తున్నారు. చిరు ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం ఒక టీమే పని చేస్తోంది. పబ్లిసిటీ డిజైనర్ అనిల్ భాను ఈ టీంను లీడ్ చేస్తున్నాడు. తన రీఎంట్ర మూవీ కోసం చిరు తన లుక్ విషయంలో ఎంత కష్టపడ్డాడో తెలిసిందే. తొలి రోజు షూటింగ్ లో ఆయన లుక్ చూసి అభిమానులు ఉత్సాహం పట్టలేకపోయారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ వాళ్లలో ఇంకెంత ఉత్సాహం నింపుతుందో చూడాలి. ఫస్ట్ లుక్ పరిచయం చేస్తూ సినిమా టైటిల్ కూడా ప్రకటించే అవకాశముంది. కత్తిలాంటోడు అని.. నెపోలియన్ అని ఈ సినిమాకు రకరకాల టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. మరి ఏది ఫైనలైజ్ అవుతుందో చూడాలి.

Leave a Reply