‘నెపోలియన్’ గా చిరు..

0
599
chiru 150 movie nepolian

chiru 150 movie nepolian

చిరంజీవి 150 వ చిత్రం టైటిల్ ఏంటనేది కొంతకాలంగా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి మొదట కత్తిలాంటోడు అనే టైటిల్ ని సినిమా ప్రారంభానికి ముందు ఫ్యాన్స్ సమక్షంలో ప్రకటించారు. అయితే రామ్ చరణ్ ఆ మధ్యన ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ ఆ టైటిల్ ఉండదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. . ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘నెపోలియన్’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

‘పోరాటం అతని నైజం’ అనే ట్యాగ్ లో పాటు ఉన్న పోస్టర్ కూడా సోషల్ మీడియాలో  పోస్టు చేశారు. ఆ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో పొలం దున్నుతున్న రైతు ఫొటోను, చిరంజీవి ఫొటోను ఇచ్చి చిరంజీవి ముఖంపై భూభత్సం, రైతు ఆత్మహత్యలు, ల్యాండ్ మాఫియా వంటి అంశాలకు సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్‌లను ప్రచురించారు. అయితే ఇది అఫీషియల్ టైటిలా..? లేదా అన్న విషయం తెలియాలంటే మెగా టీం క్లారిటీ ఇవ్వాల్సిందే

Leave a Reply