చిరు మళ్లీ కేంద్రమంత్రి అవుతారా?

 Posted November 2, 2016

chiru again central minister through tdp party
మెగా స్టార్ చిరంజీవి మళ్లీ కేంద్రమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారా? చురుకైన ప్రయత్నాలు చేయడం లేదు కానీ ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. ఆయనతో దగ్గర సంబంధాలున్న ఓ టీడీపీ ఎమ్మెల్యే తమ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్ బాగుంటుందని చిరుని సంప్రదించారట. అయితే గత అనుభవాల దృష్ట్యా సీఎం పీఠం విషయాన్ని పక్కనబెట్టి కేంద్రమంత్రి వర్గంలో మరోసారి చోటు దక్కితే బాగుండని చిరు సూచనప్రాయంగా ఆ ఎమ్మెల్యే తో అన్నారట.చిరుకి ఇంకో ఏడాదిన్నర రాజ్యసభ పదవీకాలం వుంది.ఈ లోపే టీడీపీ నుంచి గౌరవప్రదమైన ఆహ్వానం లభించి..మళ్లీ రాజ్యసభ ,కేంద్ర మంత్రి పదవి హామీ ఇస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి మెగా స్టార్ సిద్ధంగా ఉన్నట్టు ఆయనతో సంప్రదింపులు జరిపిన ఎమ్మెల్యే చెబుతున్నారు.

చిరు కోరిక ఆ ఎమ్మెల్యే ద్వారా ఇప్పటికే చంద్రబాబు చెవిన పడిందని…అయన కూడా సానుకూలంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.చిరు సామజిక వర్గ నేతలతో కూడా బాబు ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట .2019 నాటికి పవన్ కి ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా చిరు ఆవిర్భావానికి టీడీపీ మంచి వేదిక అవుతుందని ఆ పార్టీ లోని కాపు నేతలు ఇటు బాబుకి ..అటు చిరుకి చెబుతున్నారట.వారి ప్రయత్నాలు ఫలిస్తే చిరు మరోసారి కేంద్రమంత్రి కావడం ఖాయం.

SHARE