Posted [relativedate]
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ఏ సినిమా అయినా మెగా అభిమానులు వెర్రెత్తిపోతారు. ఇక రిలీజ్ రోజు వాళ్లు చేసే హడావుడి అంతాఇంతా కాదు. ఈలలు- గోలలు, కటౌట్లు- టిక్కెట్లు … ఇలా ఓ రేంజ్ హడావుడి చేస్తుంటారు. ఇదంతా ఆ సినిమాలో తమ అభిమాన మెగా హీరో నటించినందుకే. అయితే ఒకే సినిమాలో తమ అభిమాన మెగా హీరోలిద్దరూ కలిసి నటిస్తే… ఇక వారి ఆనందానికి అవధులుండవు.
సరిగ్గా అటువంటి హ్యాపీ మూమెంట్ ని అభిమానులకు అందించేందుకు మెగా హీరోలు రెడీ అయిపోయారని సంబంధిత చిత్ర నిర్మాత, ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి రీసెంట్ గా ఎనౌన్స్ చేశారు. గతంలో రజనీకాంత్, శోభన్ బాబులతో వంటి టాప్ స్టార్లతో మల్టీ స్టారర్ సినిమాను నిర్మించారు సుబ్బిరామిరెడ్డి.
ఇక చిరంజీవి కాంగ్రెస్ లో పర్యాటక శాఖా మంత్రిగా వ్యవహరిస్తుండగా, పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఏపి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలసిందే. కాగా ప్రస్తుతం సుబ్బిరామి రెడ్డి ఎంపీగా ఉండడం, మెగా బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాల్లో ఉండడంతో ఈ మల్టీ స్టారర్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఈ రూమర్లపై స్పందించారు సుబ్బిరామిరెడ్డి.
చిరు, పవన్‌లు ఇప్పటికే పలు సినిమాలు ఒప్పుకున్నారని, ఇక వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా తీయడానికి కుదరదని కొందరు అంటున్నారని, అయితే తాను కచ్చితంగా వారితో సినిమా తీస్తానని స్పష్టం చేశారు. వృక్షం రావాలంటే విత్తనం వేయాలని, ఆ విత్తనం తాను ఇప్పుడే వేశానని అన్నారు. పవన్, చిరు, త్రివిక్రమ్ ముగ్గురూ ఎల్లప్పుడూ బిజీగానే ఉంటారని, అయినప్పటికీ తాను సినిమా తీస్తానని చెబితే ఒప్పుకున్నారని తెలిపారు. ఇక కధ గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్నట్లు ఈ మల్టీ స్టారర్ సినిమాకి, రాజకీయాలకి సంబంధంలేదన్నారు. దీంతో త్రివిక్రమ్ మార్క్ ఉన్న ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రానుందంటూ అభిమానులు తెగ సంబంరపడిపోతున్నారు.