150 వ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్న చిరంజీవి కొన్నాళ్ల పాటు రాజకీయాలకి దూరంగా వుండాలనుకుంటున్నారంట.కాంగ్రెస్ లో కొనసాగుతున్నా చురుగ్గా వ్యవహరించకూడదని భావిస్తున్నారట.అలాగే ముద్రగడ సారధ్యంలో సాగుతున్న కాపు ఉద్యమ వ్యవహారాలకు కూడా అంటీముట్టనట్టు ఉండాలని చిరు ఆలోచన.దీనికి కారణం ఏంటా అని ఆరా తీస్తే రెండు విషయాలు తెలిశాయి.
కాపు ఉద్యమంలో చురుగ్గా వ్యవహరిస్తే దాని ప్రభావం 150 వ సినిమా మీద పడొచ్చని అయన సన్నిహితులు చిరుని హెచ్చరించారట.రాజకీయాల వల్ల దెబ్బ తిన్న ఇమేజ్ కుల రాజకీయాలతో ఇంకా మసకబారుతుందని నచ్చచెప్పారట.వారి మాటలకి బదులిస్తూ నేను కూడా ఆ పరిస్థితులకి ఇమడలేకపోతున్నానని చిరు అన్నారట.దాసరి ఇంట్లో జరిగిన చర్చల్లో అంతా వైసీపీ నేతలే డిసైడ్ చేసేస్తున్నారని,నా కన్నా దాసరి మాటకే ఎక్కువ విలువిచారని చిరు వాపోయారట.ఈ రెండు విషయాల్ని దృష్టిలో ఉంచుకొని కొన్నాళ్ళు …కనీసం 150 వ సినిమా విడుదల అయ్యేదాకా అందరివాడుగా ఉండాలని చిరు నిర్ణయానికి వచ్చారంట.