చిరు మీలో ఎవరు కోటీశ్వరుడుకు బ్రేక్‌

0
601
chiru break to meelo evaru koteswarudu program

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

chiru break to meelo evaru koteswarudu program because of chiru new movie
మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి 13న ప్రారంభం అయిన ఈ షో నాల్గవ సీజన్‌ను మొదట 40 ఎపిసోడ్‌లకు పూర్తి చేయలని భావించారు. అయితే పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు, మంచి లాభాలే వస్తుండటంతో మరో 20 ఎపిసోడ్‌లను పెంచారు. ఈ నెలాఖరున నాల్గవ సీజన్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సన్నిహితులతో చెప్పుకొచ్చాడు.

చిరంజీవి త్వరలో ఛారిత్రాత్మక చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రంలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. ఆగస్టులో సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా కోసం చిరంజీవి కత్తి యుద్దంతో పాటు గుర్రపు స్వారీ కూడా చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ప్రావిణ్యం సాధించేందుకు శిక్షణ తీసుకోనున్నాడు. అందుకే ఈనెలతో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టబోతున్నారు. అయిదవ సీజన్‌ను చిరంజీవి చేస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Leave a Reply