ఆరు పదుల’ చిరు ‘

0
713

  chiru dance 60 years old ageమెగాస్టార్ చిరంజీవి 60 ఏళ్ల వయసులో రాననుకున్నారా, రాలేననుకున్నారా, స్టెప్పులెయ్యలే ననుకున్నరా అని లైవ్ లో స్టేప్పులేసి చూపించాడు. మెగాస్టార్ స్టెప్పులు అలా ఇలా వెయ్యలేదు అదే ఈజ్ అదే గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు.ఆడిటోరియం అదిరిపోయిందంతే…. సునీల్ బంగారుకోడి పెట్ట,నవదీప్ అబ్బనీ తియ్యనీదెబ్బా ,సాయి తరమ్ తేజ్ ఈ పేటకు నేనే మేస్త్రి సాంగ్స్ కి డాన్స్ చేసి చిరు పై వీరాభిమానాన్ని చాటుకున్నారు.

60 ఏళ్ళ వయసులో సినిమాతీసి ఏం అలరిస్తాడు అని అనుకునే వాళ్ళ అనుమానాలు తొలగించాడు చిరు.బహుశా చిరంజీవి కూడా ఈ ఉద్దేశ్యంతోనే మా అవార్డ్స్ కి వస్తున్నానని,లైవ్ పెర్ఫార్మన్స్ ఉందని ముందే ప్రకటించారు.ఆయన అనుకున్నదానికి, అన్నదాని కంటే స్టేజ్ పై స్టెప్పులు అదరగొట్టారు.ఆడియన్స్ కి లేచి డాన్సు చెయ్యాలనిపించింది. అంతగా మతిపోగోట్టారు.

ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా….చిరు 150 వ సినిమా ఎలా ఉండబోతుంది,ఏయే ఎలిమెంట్స్ ఉంటాయి చెప్తూ ఒక వీడియో అందించారు.శ్రీకాంత్,సునీల్,సాయి తరమ్ తేజ్,నవదీప్ లతో కలిసి గ్యాంగ్ లీడర్ లోని G …A ..N … G ….గ్యాంగ్ గ్యాంగ్ సాంగ్ కి డాన్సు చేశారు.ఇక మెగా అభిమానులకు సందడే సందడి ఈ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.ఆ వీడియో ని చూసి అంతా ఎంజాయ్ చేస్తున్నారు.

Leave a Reply