ఇన్నేళ్లైనా చిరులో ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదు..!!

Posted February 6, 2017

chiru energy levels after 10 yearsమెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు మోత మోగిపోతోంది. అందుకు కారణం చిరు నటించిన ఖైదీ నెం. 150. దాదాపు పది సంవత్సారాల తర్వాత చిరు చేసిన ఈ సినిమా మంచి సక్సెస్‌ ను సాధించడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా ఈ మూవీని చూసిన పలువురు ప్రముఖులు చిరుపై ప్రశంసలు కురిపించగా, తాజాగా  కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కూడా చిరు నటనకి ఫిదా అయిపోయారు.

చిరంజీవి హీరోగా శుభలేఖ, ఆపద్బాంధవుడు, స్వయం కృషి వంటి కళాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన కె. విశ్వనాధ్… నిన్న  రాత్రి ఈ మూవీ స్పెషల్‌ షోను చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌తో కలిసి చూశారు.

పదేళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరులో  ఎనర్జీ కానీ, గ్రేస్‌ కానీ ఏ మాత్రం తగ్గలేదని, మూవీ చాలా బాగుందని కితాబిచ్చారు. ఇకపై చిరంజీవి తన నటనను కంటిన్యూ చేస్తూ, మరిన్ని మంచి చిత్రాలలో నటించాలని ఆకాంక్షించారు. చూద్దాం.. చిరు ఇంకెన్ని సినిమాలను అభిమానులకు అందివ్వనున్నాడో మరి.

SHARE