కొట్టేస్తున్న చిరు..

0
445

  chiru fighting 150 movie latestమెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కొంతమంది రౌడీలతో చిరు తలపడే సన్నివేశాలను దర్శకుడు వినాయక్ తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ ఫైట్ సినిమాలో విశ్రాంతికి ముందు వస్తుంది. ఈ పోరాటం నుంచే కథ కీలకమైన మలుపు తిరుగుతుంది. చిత్రంలో ఈ ఫైట్ కు చాలా ప్రాధాన్యత ఉండడంతో ఒక రేంజ్ లో ఉండేలా రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేశారు. సినిమాకి ఈ ఫైట్ హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఫస్టులుక్ ను విడుదల చేయనున్నారు. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం.

Leave a Reply