పాలిటిక్స్ కు చిరు గుడ్ బై?

 Posted March 31, 2017

ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించి.. ఆ త‌ర్వాత కాంగ్రెస్ లో చేరిపోయిన మెగాస్టార్ చిరంజీవికి పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ పోయిందా? ఇక ఆయ‌న పాలిటిక్స్ కు గుడ్ బై చెప్ప‌బోతున్నారా? అందుకే రాజ్య‌స‌భ‌లోనూ క‌నిపించడం లేదా? అంటే ఔన‌నే అంటున్నాయి ఏపీ కాంగ్రెస్ శ్రేణులు.

గ‌త కొన్ని రోజులుగా రాజ్య‌స‌భ సమావేశాలు జ‌రుగుతున్నాయి. కానీ ఎక్క‌డ ఎంపీ చిరంజీవి క‌నిపించ‌డం లేదు. గ‌త వ‌ర్షాకాల స‌మావేశాల్లోనూ ఆయ‌న కేవ‌లం ఒకే ఒక్క‌రోజు క‌నిపించారు. అది కూడా జీఎస్టీ బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటేయాల‌ని కాంగ్రెస్ విప్ జారీ చేసింది కాబ‌ట్టి వ‌చ్చారు. అలా ఒక్క‌రోజు వ‌చ్చి మ‌మ అనిపించేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న ముఖ‌మే కాన‌రాలేదు. ఇక ఈసారైతే మెగాస్టార్ మొత్తానికే డుమ్మా కొట్టేశారు. దీంతో తోటి కాంగ్రెస్ ఎంపీలు ఆయ‌న తీరుపై నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లే కాంగ్రెస్ కు గ‌డ్డుకాలం. రాజ్య‌స‌భ‌లో ఉన్న బ‌లాన్ని ఉప‌యోగించుకొని ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడ‌దామంటే చిరంజీవి లాంటి వారు డుమ్మా కొడుతున్నారు. అయితే పాలిటిక్స్ పై చిరుకు ఇంట్ర‌స్ట్ పోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అందుకే ఆయ‌న రాజ్య‌స‌భ‌కు ఆబ్సెంట్ అవుతున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న ప‌రిణామాల‌తో చిరంజీవి మ‌న‌స్తాపం చెందార‌ట‌. ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి జీరో అయిపోవ‌డం.. భ‌విష్యత్తులోనూ కాంగ్రెస్ ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుంద‌న్న ఆశ లేక‌పోవ‌డంతో ఇక పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు టాక్. ఎలాగూ త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పాలిటిక్స్ లోకి వ‌చ్చేశారు. తాను వేరే పార్టీలో ఉంటే త‌మ్ముడికి కూడా ఇబ్బందే. ఇవ‌న్నీ ఎందుకు ..రాజ‌కీయాల నుంచి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుందామ‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇంకా రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగియ‌లేదు కాబ‌ట్టి అది ముగిసేవ‌ర‌కు వేచి చూసి.. ఆ త‌ర్వాత నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే యోచ‌న‌లో ఉన్నార‌ట చిరంజీవి. మొత్తానికి ఒక‌వైపు ర‌జినీ పొలిటిక‌ల్ ఎంట్రీ వార్త‌లొస్తున్న నేప‌థ్యంలో.. చిరంజీవి పొలిటిక‌ల్ రిటైర్మెంట్ వార్తలు రావ‌డాన్ని అభిమానులు మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు.

SHARE