Posted [relativedate]
మెగా ఖైదీ మాస్ స్టెప్పులు పూర్తయ్యాయి. ఇటీవలే హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చిరు-లక్ష్మీరాయ్ లపై ఖైదీ స్పెషల్ సాంగ్ చిత్రీకరించిన విషయం తెలిసింది. ఇప్పుడు క్లాస్ స్టెప్పుల కోసం ఉక్రెయిన్ వెలుతోంది మెగా ఖైదీ టీం. ఉక్రయిన్ లో చిరు-కాజల్ లపై ఒకెట్రెండు డ్యుయెట్ సాంగ్స్ ని చిత్రీకరించనున్నారు. దీంతో.. షూటింగ్ దాదాపు పూర్తవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ లో మంచి మంచి లొకేషన్స్ వెతికి పెట్టారట.
వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’లో చిరు సరసన కాజల్ జతకడుతోంది. లక్ష్మీరాయ్ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. మెగాస్టార్ రీ-ఎంట్రీ చిత్రంతో అభిమానులని అలరించే అన్ని అంశాలని పక్కగా ప్లాన్ చేశాడు వినాయక్. పాత చిరు కనిపించడం ఖాయమని చిత్రబృందం చెబుతోంది. మెగా ఖైదీని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.