Posted [relativedate]
ఖైదీ నెం. 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. ఆరు పదుల వయసు దాటినా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని చిరు నిరూపించుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఖైదీ నెం.150 పేరుతో వినిపిస్తున్న రికార్డులే మరీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
చిరు సినిమా టోటల్‌గా రూ.165 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ రికార్డు బాహుబలికి వర్తించదని, అది నాలుగు భాషల్లో విడుదలైందని, తమ సినిమా కేవలం ఒక్క భాషలోనే విడుదలైందని అంటున్నారు యూనిట్ సభ్యులు. అలానే రోబో, ఐ సినిమాలు కూడా 150 కోట్లు కలెక్ట్ చేశాయని, అయితే అవన్నీ ఇతర భాషల్లో కూడా విడుదల కావడంతో అంత మొత్తాన్ని కలెక్ట్ చేశాయి, కానీ చిరు ఖైదీ నెం.150మాత్రం కేవలం తెలుగులోనే ఆ రేంజ్ కలెక్ట్ చేసిందని అంటున్నారు. కాబట్టి సౌత్ ఇండియాలో తమ సినిమాను మించిన సినిమా లేదని చెప్పుకుంటున్నారు. చిత్రయూనిట్ ఫేక్ లెక్కలు చూపించి సొంత డబ్బాలు కొట్టుకుంటోందని ని ట్రేడ్ సభ్యులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండి కూడా ఇతర హీరోలు సాధించని రికార్డు చిరు సాధించాడు. చిరు స్టామినాను చెప్పడానికి ఇది ఒక్కటీ చాలని, ఫేక్ రికార్డులు చూపించుకుంటూ చిరు ఇమేజ్ ని డ్యామేజ్ చేయనవసరం లేదన సూచిస్తున్నారు.