నేషనల్ అవార్డు రేసులో చిరు సినిమా..!!

0
402
chiru khaidi no 150 movie got place in national awards

 Posted [relativedate]

chiru khaidi no 150 movie got place in national awards64th నేషనల్ అవార్డ్స్ ని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ నేషనల్ అవార్డ్స్ కి సంబంధించి  రీసెంట్ గా ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ  నెం. 150…  2016జాతీయ పురస్కారాల  రేసులో ఉందని  ఆ వార్త సారాంశం. అయితే చిరు సినిమా రీమేక్ కావడంతో ఆ వార్తలను పుకార్లుగానే కొట్టిపడేశారు కొందరు సినీ పెద్దలు. అయితే తొలిసారిగా అవార్డుల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో  ఓ రీమేక్ సినిమా…  అదీ మన  చిరు సినిమా ఇప్పుడు జాతీయ పురస్కారాల బరిలో నిలబడింది. గతేడాదే చిరు సినిమాకు సెన్సార్ అయిపోడంతో ఖైదీ నెం. 150  రేసులో నిలబడగలిగింది. దాదాపు  16 తెలుగు సినిమాలు.. జాతీయ పురస్కారాల పోటీలకు నామినేట్ కాగా  ఫైనల్ గా నాలుగు సినిమాలు అవార్డుల బరిలో నిలబడ్డాయి.

అందులో ఒకటి చిరు ఖైదీ నెం. 150 సినిమా కాగా శతమానం భవతి, పెళ్లి చూపులు, మనలో ఒక్కడు సినిమాలు కూడా ఉత్తమ చలనచిత్రం రేసులో నిలబడ్డాయి. అయితే చిరు సినిమా కేవలం బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలోనే  కాకుండా బెస్ట్ స్టంట్స్, బెస్ట్ సాంగ్ వంటి ఇతర కేటగిరీల్లో కూడా సెలెక్ట్ అయ్యింది. మరి మన తెలుగు సినీ పరిశ్రమను  ఎన్ని అవార్డులు వరిస్తాయో చూడాలి.

Leave a Reply