Posted [relativedate]
దీపావళి సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.చిరుకి కోట్లాది అభిమానుల్ని సంపాదించి పెట్టిన డాన్స్ ఫోజ్ నే ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు.సన్నబడిన మెగా స్టార్ కుర్ర హీరోలకి దీటుగా కనిపిస్తున్నాడు.అందుకే కాబోలు ఎప్పుడూ చిరు మీద కామెంట్స్ చేసే రామ్ గోపాల్ వర్మ సైతం చిరుపై ప్రశంసలు కురిపించాడు.ఏడేళ్ల కిందట తాను చూసిన చిరు కన్నా ఇప్పటి మెగా స్టార్ యంగ్ గా వున్నాడని ట్వీట్ వేసాడు.ఇక రాంచరణ్,వరుణ్ తేజ్ వంటి మెగా హీరోలు సైతం చిరు లుక్ అదుర్స్ అంటూ మెగా ఫాన్స్ జోష్ ని అంతకంతకు పెంచుతున్నారు.