మెగా ఐటమ్ నుంచి కేథరిన్ అవుట్.. కారణాలివే!

Posted October 14, 2016

  chiru khaidi number 150 movie item song catherine out lakshmi rai in reason

మెగాస్టార్ 150 నుంచి ముద్దుగుమ్మ కేథరిన్ అవుట్ అనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ న్యూస్ గా కొనసాగుతోంది. సరైన అందాలు కలిగిన కేథరిన్ ని ఏరికోరి మరి మెగా ఐటమ్ గా ఫిక్స్ చేశారు. మెగా ఛాన్స్ ఇప్పించడం వెనక స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడనే ప్రచారం జరిగింది. బ్యాక్ ఇంతటి సపోర్టు, ఫ్రంట్ కళ్లు చెదిరే అందాలని పెట్టుకొని కేథిరిన్ మెగాస్టార్ 150 నుంచి ఎందుకు అవుట్ అయింది.. ? ఇంతకీ కేథరిన్ ఎవరికి కెలికితే ఈ రియాక్షన్ వచ్చింది.. ? అసలు మేటర్ లోకి వెళదాం పదండీ..

సింపుల్ గా చెప్పాలంటే కేథిరిన్ గెలుక్కోవడమే ఈ రియాక్షన్  కి కారణంగా తెలుస్తోంది. సెట్స్ లోకి వచ్చిన ఫస్ట్ డే తన ప్రతాపనంతా చూపించేసిందట ఈ
ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవితో జీవితాంతం గుర్తుండిపోయే వీణ స్టెప్పును వేయించాడు కొరియోగ్రాపర్ లారెన్స్. అప్పటి నుంచి లారెన్స్ అంటే మెగాస్టార్ కి ఫుల్ లైకు. అందుకే పిలిచి మరీ.. మెగా 150ఐటమ్ లారెన్స్ చేతిలో పెట్టాడు. లారెన్స్ కూడా చిరు కోసం మరోసారి అదిరిపోయే స్టెప్పులని కంపోజ్ చేశాడు. దాంతో పాటుగా.. ఐటమ్ భామ కేథరిన్ కి హీటెక్కించే డ్రెస్ లని డిజైన్ చేయించాడట. తీరా షూటింగ్ మొదలయ్యాక లారెన్స్ చూపించిన డ్రెస్సులని వేసుకునేందుకు కేథరిన్ ససేమిరా అన్నదట. పైగా.. లారెన్స్ పైనే కస్సుమన్నదట.

కొద్దిసేపు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన లారెన్స్.. చివరికి కేథరిన్ కస్సుబుస్సుల సంగతిని మెగాస్టార్ చెవిలో ఊదాడట. చివరికి మెగాస్టార్ సూచనలతో మెగా ఐటమ్ నుంచి కేథరిన్ అవుట్… లక్ష్మీరాయ్ ఇన్ అయ్యిందంటున్నారు. దీంతో.. మెగా 150లో పవన్ ఐటమ్ చేరిపోయినట్టయ్యింది. ఎందుకంటే.. పవన్ సర్థార్ గబ్బర్ సింగ్ ‘థోబా థోబా.. ‘ ఐటమ్ సాంగ్ లో రెచ్చిపోయింది లక్ష్మీరాయ్. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఇంకే రేంజ్ లో హీటెక్కిస్తోందో చూడాలి.

SHARE