మళ్లీ చిరు ..ప్రభు దేవా కాంబో ..

0
531

  chiru prabhudeva combo set
మెగాస్టార్ చిరంజీవి .మళ్లీ ప్రభుదేవాతో జట్టు కట్టబోతున్నాడు .150 వ సినిమా కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న చిరు శంకర్ దాదా జిందాబాద్ అనుభవం మర్చిపోయాడా అనుకుంటున్నారా ?ఈ ఇద్దరు కలిసి పనిచేయబోయేది ఎలాగో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన చాలా సినిమాలకు ప్రభుదేవా కొరియోగ్రఫీని అందించాడు. ఈ ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటే చిరుకి ప్రత్యేకమైన అభిమానం. చిరంజీవి అన్నాప్రభుదేవాకి ఎంతో గౌరవం. ఒకరంటే మరొకరికి ఉన్న ఈ విపరీతమైన అభిమానమే మరోసారి వీరిని దగ్గరకు చేసింది. చిరంజీవి తాజా చిత్రంలోని ఒక పాటకి ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించనున్నట్టు సమాచారం.

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తన 150 చిత్రంలో ఒక పాటను ప్రభుదేవాకి ఇవ్వవలసిందేనని చిరంజీవి పట్టుపట్టారట. అందుకే ఆయనకి ఛాన్స్ వెళ్లిందని అంటున్నారు. చిరంజీవి సినిమా కావడంతో ప్రభు వెంటనే ఒప్పేసుకున్నాడనీ, ప్రస్తుతం ఆ పాటకి డాన్స్ ను కంపోజ్ చేసే పనిలో వున్నాడని అంటున్నారు.

Leave a Reply