Posted [relativedate]
మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సర్వం సిద్ధం అవుతోంది .జనవరి నాలుగో తేదీన విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో జరగనున్న ఈఫంక్షన్ కి వ్యాఖ్యాతలు గా టీవీ పరిశ్రమకి చెందిన వాళ్ళు కాకుండా ఏకంగా వెండితెర హీరోలు రంగంలోకి దిగబోతున్నారు .రానా ,నవదీప్ ఈ ప్రోగ్రాం వ్యాఖ్యానం బాధ్యతలు చూడబోతున్నాయారు .నవదీప్ ఇంతకుముందు చాలా సార్లు యాంకరింగ్ చేశారు .రానా మాత్రం తొలిసారి ఈ పాత్ర పోషించబోతున్నారు.ఈ సినిమా నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్నేహితుడు కావడం వల్లే రానా యాంకరింగ్ కి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది .