ముద్దుగుమ్మల “మెగా” సెల్ఫీ.. అదిరిందిగా!

0
570

 Posted [relativedate]

chiru radhika suhasini and sumalatha selfie at meelo evaru koteeswarudu tv show

ఐదు పదుల వయసు దాటినా మెగాస్టార్ చిరంజీవి జోరు ఏ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా ఖైదీ నెం.150తో వెండితెరని షేక్ చేసిన చిరు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు. ఈ నెల 13న ప్రారంభమైన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో హోస్ట్ గా తమ అభిమాన హీరో చిరుని చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మెగాస్టార్ గ్రాండ్ సక్సెస్ అన్న టాక్ కూడా వచ్చేసింది.

కాగా ఈ కార్యక్రమానికి అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా వస్తున్నారన్న  విషయం తెలిసిందే. నిన్న వేలంటైన్స్ డే సందర్భంగా ఈ  కార్యక్రమానికి ఒకప్పడు హీరోయిన్లుగా వెలిగిన రాధిక, సుహాసిని, సుమలత హాజరుకావడం విశేషం. వాళ్లు హాజరుకావడమే కాదు షోలో పార్టిసిపేట్ కూడా చేశారు. ఈ ముగ్గురితో మెగాస్టార్ చాలా సినిమాల్లోనే  నటించాడు. ముఖ్యంగా హీరోయిన్ రాధికతో  చిరంజీవి నటించిన సినిమాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. నిన్న వాలెంటైన్స్  డే సందర్బంగా ఆయన  తన హీరోయిన్లతో ఓ మెగా సెల్ఫీకి పోజిచ్చాడు. ఈ సెల్ఫీతో గతరోజుల జ్ఞాపకాల్లోకి వెళ్లినట్లైంది. ఏమైనా హీరోయిన్లతో చిరు దిగిన మెగా సెల్ఫీ అదిరింది కదూ.

Leave a Reply