పవన్,నాగబాబు,వర్మపై చిరు రియాక్షన్ ..

0
97
chiru reaction on pawan kalyan nagababu ram gopal varma

  Posted [relativedate]

chiru reaction on pawan kalyan nagababu ram gopal varmaఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా నానా రచ్చ జరిగినా మెగా స్టార్ చిరు ఓ చిన్న కామెంట్ తో పరిస్థితిని కూల్ చేసేందుకు ప్రయత్నించారు.హాయ్ ల్యాండ్ లో నాగబాబు వార్నింగ్,ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ ఫైరింగ్ తో మొదలైన అగ్గిని చల్లార్చేందుకు మెగా స్టార్ ట్రై చేశారు. తాను మొదటినుంచి రాము కామెంట్స్ ని లైట్ తీసుకుంటానని చిరు చెప్పేశారు. ఓ రకంగా వాటికి పట్టించుకునే స్థాయి లేదన్నట్టుగానే వుంది చిరు ధోరణి.ఇక నాగబాబు వార్నింగ్ మీద చిరు స్పందన ఇలా వుంది …’ నాగబాబు బాగా హర్ట్ అయినట్టున్నాడు.హర్ట్ అయినవాడు అలాగే రియాక్ట్ అవుతాడు కదా అని సింపుల్ గా తేల్చేశాడు చిరు.

ఇక ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ రాకపోవడం మీద కూడా చిరు క్లారిటీ ఇచ్చేశారు.ఈ ఫంక్షన్ కి రావాలని పవన్ ని చరణ్ పిలిచాడు.నాకు పని ఉందని …రాలేనని పవన్ చెప్పాడు.అయినా పిలిచిన వాళ్ళందరూ రావాలని లేదుగా అన్న కామెంట్ తో చిరంజీవి సరిపెట్టేశారు.మొత్తానికి ఓ పెద్దమనిషిగా ఏదీ పెద్ద విషయం కాదన్నట్టు తీసేశారు చిరు..జరిగిన పరిణామాల అంత ఘాటుగా చిరు రియాక్షన్ లేదనే చెప్పుకోవాలి.

Leave a Reply