వరుణ్ కి మెగా స్టార్ ఇచ్చిన సలహా ఇదే..?

Posted April 8, 2017

chiru speech in varun tej mister movie pre-release functionమెగాస్టార్ చిరంజీవి.. మెగా ఫ్యామిలీ కి మెయిన్ పిల్లర్… ఈ కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగిన చిరు తప్పకుండా హాజరవుతాడు.. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన మిస్టర్ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చిరు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.. చిరు మాట్లాడుతూ … ”వరుణ్ తేజ్ కు చెప్పేది ఒకటే.. వెనకాల మేమందరం ఉన్నాం.. ఆ వెనుక అభిమానులు ఉన్నారు.. అనే భావనతో కాకుండా ప్రతీ సినిమాకు కొత్త సినిమాలా, ఫస్ట్ సినిమాలా కష్టపడి పనిచేయాలనే చెప్పాం. కష్టాన్ని నమ్ముకుంటే అభిమానులు ఎలాగో రెడీమేడ్ గా ఉన్నారు”.ఇప్పుడు వరుణ్ తేజ్ చాలా జాగ్రత్తగా సినిమాలు ఒప్పుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు చిరంజీవి. అలాగే ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి.. ఠాగూర్ మధులకు సినిమాలపై చాలా అవగాహన ఉందని.. వారు నిర్మించడమే సగం సక్సెస్ అని పేర్కొన్నారు.

 శ్రీను వైట్ల అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలో కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. అందరివాడు టైములో మా కెమిస్ర్టీ బాగా కుదిరింది. ఆ తరువాత ఆయన డైరక్షన్లో చేయడం కుదర్లేదు. కాని ఈ మధ్యనే బ్రూస్ లీ సినిమాలో ఒక క్యామియో వేయాలని పట్టుబట్టాడు వైట్ల. నన్ను నేను మరోసారి రీ-ఎంట్రీ సమయంలో తెరమీద చూసుకునే అవకాశం ఇచ్చి.. అబ్బా మనం పర్లేదు.. అనే ఫీలింగ్ నాకు తెచ్చాడు. తను తీసిన ఢీ.. రెడీ.. దూకుడు సినిమాలు చాలా బాగుంటాయి. ఈ సినిమా కూడా అలాగే హిట్టవుతుందని ఆశిస్తున్నాను” అంటూ డైరక్టర్ గురించి చెప్పారు చిరంజీవి. ఈ సినిమాతో శ్రీను వైట్ల తనేమిటో నిరూపించుకునే ఛాన్సు ఉందని.. నిరూపించుకోవాలని సూచించారు.

ఇక మ్యూజిక్ డైరక్టర్ మిక్కి.జె.మేయర్ పాటలు చాలా సాఫ్ట్ గా బాగుంటాయని.. ఈ సినిమాలోని పాటలుకూడా చాల బాగున్నాయి అని చెప్పాడు. కథ రాసిన గోపిమోహన్.. డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపాన.. హీరోయిన్లు లావణ్య త్రిపాఠి.. హెబ్బా పటేల్.. అందరినీ అభినందించారు

SHARE