చిరు కోసం ఊర మాస్‌ సిద్దం

Posted May 19, 2017 at 19:05

chiru to do 152 movie with boyapati srinu directionమెగాస్టార్‌ చిరంజీవి దాదాపు పది సంవత్సరాల తర్వాత ‘ఖైదీ నెం.150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇకపై వరుసగా సినిమాలు చేస్తానంటూ చిరంజీవి ప్రకటించాడు. అయితే తన 151వ సినిమాగా భారీ చిత్రం అయిన ఉయ్యాలవాడను మొదలు పెట్టడంతో కాస్త ఆలస్యం అవుతుంది. ఉయ్యాలవాడ సినిమా తర్వాత వెంట వెంటనే సినిమాలు చేసేందుకు చిరంజీవి ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నాడు. చిరు 151వ సినిమా సెట్స్‌ పైకి వెళ్లక ముందే 152వ సినిమాకు సంబంధించిన చర్చలు సంప్రదింపులు జరిగి పోయాయి.

చిరంజీవి 152వ సినిమాను బోయపాటి దర్శకత్వంలో మెగా నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మించబోతున్నాడు. అందుకోసం ఇప్పటికే బోయపాటికి అల్లు అరవింద్‌ అడ్వాన్స్‌ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బెల్లంకొండ హీరోతో ఒక సినిమాను చేస్తున్న బోయపాటి ఆ తర్వాత చిరంజీవి కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేయబోతున్నాడు. ఒక ఊరమాస్‌ సబ్జెట్‌తో చిరంజీవిలోని మాస్‌ యాంగిల్‌ను పూర్తిగా తీస్తానంటూ బోయపాటి చెబుతున్నాడు. యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా పేరున్న బోయపాటి సినిమాలకు మాస్‌ ఆడియన్స్‌ ఫిదా అవుతారు. అందుకే పూర్తి స్థాయి మాస్‌ సబ్జెట్‌తో ఈ సినిమాను చేసేందుకు బోయపాటి ప్లాన్‌ చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఆరంభంలో చిరు 152వ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

SHARE