Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెల్సిందే. 125 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు నుండి సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. భారీ సెట్టింగ్స్‌తో పాటు స్వాతంత్య్రంకు పూర్వం ఉన్న పరిసరాలను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్స్ ఆగస్టు వరకు హైదరాబాద్ శివారు ప్రాంతంలో సిద్దం చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాను ఇంకా ప్రారంభించకుండానే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. చిరంజీవి నటించిన పలు సినిమాలు సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చిరు 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అనే విషయం తెల్సిందే. ఆ సినిమా సంక్రాంతికే విడుదల అయ్యింది. ఆ సినిమా తర్వాత మళ్లీ తన తర్వాత సినిమా కూడా సంక్రాంతికే విడుదల అవ్వాలని చిరంజీవి ఆశిస్తున్నాడు. అందుకోసం సురేందర్ రెడ్డి మరియు చరణ్ కూడా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతికి మహేష్‌బాబు, కొరటాల శివ కన్ఫర్మ్ అయ్యింది. ఇటీవలే ప్రారంభం అయిన వీరి కాంబో మూవీ సంక్రాంతికి రావడం దాదాపు ఖాయం.
వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఇలాంటి నేపథ్యంలో మహేష్‌బాబు సినిమాకు పోటీగా సెంటిమెంట్‌ను నమ్ముకుని చిరంజీవి తన 151వ సినిమాతో రాబోతున్నాడు. సినిమా బాగుంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని, ఎంత పెద్ద పోటీ సినిమాలు ఉన్నా కూడా పర్వాలేదు అని గత సంక్రాంతికి విడుదలైన ‘ఖైదీ నెం.150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘శతమానంభవతి’ చిత్రాలు రుజువు చేశాయి. అలాగే వచ్చే సంక్రాంతికి కూడా చిరు, మహేష్‌లు సక్సెస్‌లు సాధిస్తారేమో చూడాలి.