ఏప్రిల్ లో సెట్స్ పైకి చిరు “ఉయ్యాలవాడ”

0
643
chiru uyyalawada narasimha reddy movie sets on april

Posted [relativedate]

chiru uyyalawada narasimha reddy movie sets on aprilఖైదీ నెం. 150 సినిమాతో  మెగాస్టార్ చిరంజీవి బాక్సులు, రికార్డులూ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే  ఆ సినిమా రిలీజయ్యి రెండు నెలలు కావస్తున్నా తాజా సినిమా గురించి ఏ చిన్న కబురూ లేకపోయే సరికి అభిమానులు చాలా అప్ సెట్ అయ్యారు. దానికి తోడు చిరు కధలో మార్పు కోరుకుంటున్నాడని, అందుకే సినిమా ఆలస్యం అవుతోందని ఎవరికి తోచిన విధంగా వారు వార్తలను పుట్టించేస్తున్నారు. ఇలాంటి వార్తలకు చెక్ పెడుతూ, అభిమానులకు జోష్ వచ్చే విధంగా ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.

ఏప్రిల్ నుండి చిరు…  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని మెగాకాంపౌండ్ చెబుతోంది. ఈ సినిమాకు కూడా చెర్రీనే నిర్మాతగా వ్యవహరించనున్నాడు. చెర్రీతో ధృవ సినిమాను రూపొందించిన సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఉయ్యాలవాడపై వచ్చిన పుస్తకాలను అధ్యయనం చేయడంతో పాటు ఆయన కుటుంబీకుల నుండి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాడు. అది కూడా చివరి దశలో ఉండడంతో సినిమాను ఏప్రిల్ లో నుండి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. 1857.. ఫస్ట్ రెవల్యూషన్ కంటే ముందుగానే బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటును చేపట్టి, సమరయోధుడిగానే తనువు చాలించిన ఉయ్యాలవాడగా చిరు కనిపించనున్నాడు. సో.. గెట్ రెడీ ఫర్ చిరు ఉయ్యాలవాడ.

Leave a Reply