Posted [relativedate]
ప్రస్తుత టాలీవుడ్ హీరోల శైలి మారింది. పోటీ అనేది కేవలం బాక్సాఫీస్ వద్దే కానీ తామంతా నిజజీవితంలో ఫ్రెండ్స్ గానే ఉంటామని నిరూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకరి సినిమాలో ఒకరు గెస్ట్ రోల్స్ చేయడం, ఒక హీరో సినిమాకి మరో హీరో వాయిస్ ఓవర్ అందించడం, ప్రమోషన్లకి రావడం వంటివి చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరు కూడా తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయాడు. గతంలో మెగా కాంపౌండ్ హీరోల ఫంక్షన్లకు మాత్రమే వచ్చే చిరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు తమ సినిమా వేడుకలకు పిలిచినా వెళుతున్నాడు. అంతేకాకుండా మాట సహాయం కూడా చేస్తున్నాడు.. అదేనండీ వాయిస్ ఓవర్లు కూడా ఇస్తున్నాడు.
రీసెంట్ గా ఘాజి సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరు తాజాగా త్వరలో విడుదల కానున్న గుంటూరోడు సినిమాకి కూడా వాయిస్ ఇచ్చాడు. నిజానికి ఈ వాయిస్ కోసం ముందుగా చెర్రీని సంప్రదించాడట మనోజ్. అయితే చెర్రీ కూడా వాయిస్ ఇచ్చేందుకు ఓకే చెప్పినా అవుట్ డోర్ లో ఉండడంతో వెంటనే మనోజ్…చిరుని సంప్రదించాడట. మనోజ్ కు తెలియకుండా వాయిస్ ఓవర్ చెప్పేసి ఎలా వచ్చిందో చూడామని మనోజ్ కి ఫోన్ చేసి చెప్పాడట చిరు. చిరు చేసిన సాయంతో మన గుంటూరోడు తెగ సంపరపడిపోతున్నాడని సమాచారం.