వార్ ఫీల్డ్ లో చిరు ల్యాండ్ మార్క్..

0
477

chiru-war-image

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా కోలీవుడ్ కత్తిని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి చాలా టైటిల్స్ తెరపైకి వచ్చినా మెగాస్టార్ బర్త్ డే…ఆగస్ట్ 22న క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఇదిలా ఉంటే చిరు లాండ్‌మార్క్ చిత్రాలకు పోరాటాలకు లింక్‌ ఉన్నట్లు తేలింది.

మెగా 150లో.. చిరు నీటి కోసం పోరాటం చేస్తారు. భూగర్భజలాలు మెండుగా ఉన్నా.. పైకి బీడువారిన భూమిని కబళించాలనుకునే కార్పోరేట్ దిగ్గజాలపై యుద్ధానికి దిగుతారు. 125 వ సినిమా ‘ది జెంటిల్మన్’లోనూ మెగాస్టార్ అవినీతిపై కత్తిదూశారు. ఇది అర్జున్-శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘జంటిల్మెన్‌’కు హిందీ రీమేక్.

100వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 786’లోనూ చిరు పోరాటాలే చేశారు. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వచ్చి.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి వచ్చే రోల్ పోషించారు. 75వ సినిమా ‘చట్టంతో పోరాటం’. ఈ మూవీలో చిరు న్యాయవ్యవస్థలోని లొసుగులపై గళమెత్తారు. చిరు ఫిల్మోగ్రఫీని పరిశీలిస్తే.. చిత్రంగా నాలుగు ల్యాండ్ మార్క్ మూవీస్ లోనూ ఆయన పోరాటాల బాటపట్టారు. ఈ నాలుగు సినిమాల్లోనూ చిరు జైలుకెళ్లిన సన్నివేశాలున్నాయి.

Leave a Reply