చిత్రాంగద రివ్యూ…

0
321
chitrangada movie review

Posted [relativedate]

chitrangada movie reviewచిత్రం: చిత్రాంగద 
తారాగణం: అంజలి, సింధూ తులాని, దీపక్‌, జయప్రకాశ్‌, సప్తగిరి, రాజా రవీంద్ర, జ్యోతి

సంగీతం: సెల్వ గణేష్‌ 
ఛాయాగ్రహణం: బాలిరెడ్డి 
నిర్మాతలు: రెహమాన్‌,  శ్రీధర్‌ గంగపట్నం 
దర్శకత్వం: అశోక్‌.జి 
విడుదల తేదీ: 10-03-2017

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ కి దగ్గరైన అంజలి గీతాంజలి  సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించగలనని నిరూపించుకుంది. దీంతో  ఆమె మరో లేడీ ఓరియెంటెడ్  సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. అశోక్‌ దర్శకత్వంలో చిత్రాంగదగా తెరకెక్కిన ఆ  హారర్ ధిల్లర్ తో అంజలి విజయాన్ని అందుకుందో  లేదో తెలుగుబుల్లెట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.  

కధ ఏంటంటే…

ఈ సినిమాలో అంజలి… చిత్రగా, జయప్రకాశ్‌.. షణ్ముఖగా, దీపక్‌… రవివర్మగా నటించారు.

సైకాల‌జీలో పీహెచ్‌డీ చేస్తుంటుంది చిత్ర. ఆమె  ఉండే హాస్టల్‌ లో స్టూడెంట్స్ తరచూ కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో అక్కడ దెయ్యం ఉందనే ప్రచారం జరుగుతుంది. కానీ ఓ స్టూడెంట్ మాత్రం వీటన్నింటికీ కారణం చిత్ర అని చెబుతుంది.  అమ్మాయిలంటే వ్యామోహం ఉన్న చిత్ర తన  తోటివారితో అసభ్యంగా వ్యవహరిస్తుంటుంది. అలా ఎందుకు ప్రవర్తిస్తుందో కనిపెట్టాలని సీనియర్‌ సైకాలజిస్టు షణ్ముఖ  ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో తనకు రోజూ ఓ కల వస్తుందని.. ఆ కలలో ఓ హత్య జరిగిందని చెబుతుంది చిత్ర. కొన్ని సంఘటనలకు చిత్ర హైపర్ అవ్వడం గమనించిన షణ్ముఖ  చిత్రకు పిచ్చి ఉందని, ఆ హత్య, కల అంతా ఊహ అని  కొట్టిపారేస్తాడు. కానీ  తనకు వస్తున్న కల అబద్దం కాదని చనిపోయిన వ్యక్తి తనకు ఏదో చెప్పాలనుకుంటున్నాడని చిత్ర వాదిస్తుంది.  చివరికి  ఆ హత్య జరిగిన స్థలం అమెరికాలో ఉందనే విషయం చిత్రకు తెలుస్తుంది. దీంతో అమెరికా వెళుతుంది.  ఆ  హత్యకు గురైంది రవివర్మ  అని పరిశోధించి తెలుసుకుంటుంది. ఇంతకీ రవివర్మ ఎవరు? రవివర్మ, చిత్రకు మధ్య సంబంధమేంటి? చిత్ర అమ్మాయిలతో అలా వింతగా ప్రవర్తించడానికి గల కారణాలేంటి..?  రవివర్మ.. చిత్రకు ఏం చెప్పాలనుకున్నాడు ..? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.  

కధనం ఏంటంటే…

పునర్జన్మల కాన్సెప్ట్‌ తో దర్శకుడు రాసుకున్న లైన్ బాగున్నప్పటికీ దాన్ని తెర మీద ఆవిష్కరించే విధానంలో తడబడ్డాడని చెప్పాలి. పోయిన జన్మలో తనను చంపిన వారిని అంతంచేయడానికి ఈ జన్మలో ఓ అమ్మాయిగా పుట్టడం, వారిపై ప్రతీకారం తీర్చుకునే క్రమం.. దేన్నీ కూడా దర్శకుడు సరిగ్గా ప్రెజంట్ చేయలేకపోయాడు. అడుగడుగున అంజలిని ఓ దెయ్యంలా చూపించి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. కథలో కేవలం థ్రిల్లింగ్‌ అంశాలు మాత్రమే ఉండటంతో హారర్‌, కామెడీ, సెంటిమెంట్‌ ఇవేవి సరిగ్గా పండలేదు. దర్శకుడు సినిమా ప్రారంభం నుంచే కథ చెప్పడం మొదలుపెట్టినా.. సెకండాఫ్  నుంచే అసలు కథ ప్రారంభమవుతుంది. 

ఎవరు ఎలా చేశారంటే…

హారర్ ధ్రిల్లర్ లో ఉండాల్సిన  హారర్ సినిమాలో ఏ మాత్రం  లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కనిపించినంత అందంగా అంజలి ఈ సినిమాలో కనిపించకపోగా.. ఆమె కాస్ట్యూమ్స్, నటన కాస్త విసుగు పుట్టిస్తాయి. సెకండ్ హాఫ్‌లో సప్తగిరి చేసిన కామెడీ కొంతవరకు నవ్వించినా.. కొద్దిసేపటికి రొటీన్ అనిపిస్తుంది. ముఖ్యంగా  కథనం సినిమాను నీరుకార్చేసిందని చెప్పచ్చు. టెక్నికల్ గా కూడా సినిమాకు మైనస్ పడింది.

ప్లస్ పాయింట్స్

పునర్జన్మ కాన్సెప్ట్

మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే

కామెడీ

పాటలు

ఆఖరి పంచ్

ఇది చిత్రాంగద కాదు…  చిత్రాం”గాధ”

Telugu Bullet Rating: 1.75/5

Leave a Reply