ట్రంప్ పిచ్చి ముదిరింది ..

Posted October 15, 2016

   Christina Dugan summer zervos said  trump Sexual Harassment the apprentice tv show
అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పిచ్చి ముదిరింది.ఆయనగారి లైంగిక వేధింపుల పర్వం లీకులు ఓ సీరియల్ ని తలపిస్తున్నాయి. వరసగా ఒకరి తర్వాత మరొకరు బయటికి వస్తూనే వున్నారు.తాజాగా ది అప్రెంటిస్ అనే టీవీ షో లో పాల్గొన్న సమ్మర్ జేరఁవోస్, మాజీ మోడల్ క్రిస్టినా గొంతు విప్పారు .ట్రంప్ తమను ఎలా వేధించాడు వివరించారు.ది అప్రెంటిస్ టీవీ షో తర్వాత కూడా టచ్ లో ఉండమని చెప్పిన ట్రంప్ …వుద్యోగం కోసం వెళితే దారుణంగా ప్రవర్తించినట్టు జేరఁవోస్ తెలిపారు.ఇక క్రిస్టినా ఓ నైట్ క్లబ్ లో తనతో ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు.

ఈ ఆరోపణలపై ట్రంప్ స్పందించారు.ఆ ఇద్దరు మహిళలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ట్రంప్ ఎదురు దాడికి దిగాడు.అంతటితో ఆగినా పర్లేదు ….వాళ్ళు తాను కోరుకునేంత అందగత్తెలేమి కాదని అన్నాడు ట్రంప్ .ఆయనగారి వ్యాఖ్యలు చూసి అమెరికన్లు ట్రంప్ పిచ్చి ముదిరిపోయిందని బహిరంగంగానే అంటున్నారు.

SHARE