‘చుట్టాలబ్బాయి’ వచ్చేస్తున్నాడు ..

0
494
addi
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’ ఆడియో జూలై 16న సాయంత్రం శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో జరుగుతుంది. యస్‌.యస్‌. ధమన్‌ ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు.
టీజర్‌ రెస్పాన్స్‌ అదుర్స్‌!
ఈ చిత్రం టీజర్‌ రెస్పాన్స్‌ గురించి నిర్మాతలు మాట్లాడుతూ – ”చుట్టాలబ్బాయి’ టీజర్‌కు ట్రమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. టీజర్‌ రిలీజ్‌ అయ్యాక బిజినెస్‌పరంగా మంచి క్రేజ్‌ వచ్చింది. అన్ని ఏరియాలు చాలా స్పీడ్‌గా బిజినెస్‌ అవుతున్నాయి. ‘ప్రేమకావాలి’, ‘లవ్‌లీ’లాంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన ఆదికి ‘చుట్టాలబ్బాయి’ మరో సూపర్‌హిట్‌ అవుతుంది. మా దర్శకుడు వీరభద్రమ్‌ ఈ చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీశారు. ‘అహనాపెళ్లంట’, ‘పూలరంగడు’ తర్వాత వీరభద్రమ్‌ గారికి ‘చుట్టాలబ్బాయి’ చాలా పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. జూలైలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, బ్రహ్మానందం, పోసాని క ష్ణమురళి, ప థ్వి, రఘుబాబు, క ష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌,
నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్‌.
 
 

Leave a Reply