‘చుట్టాలబ్బాయి’ పాటకురెడీ ….

0
616

  chuttalabbayi movie audio ready

చుట్టాలబ్బాయిగా ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మన ముందుకొస్తే….ఇపుడు ఆ పాత్రలో దూరి పోయాడు యంగ్ హీరో ఆది….ఆ ‘చుట్టాలబ్బాయి’కి దర్శకుడు వీరభద్ర చౌదరి…శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది.కేవలం 24 గంటల్లో లోనే 1.5 లక్షల వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను పెంచింది.జులై 16 న ఈ సినిమా ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..

ఈ’చుట్టాలబ్బాయి’ గట్టి సవాళ్ల మధ్య తన సత్తా చూపించాలని తాపత్రయ పడుతున్నాడు..హీరో ఆది నటించిన ఇటీవలి చిత్రాలు పెద్దగా ఫలితమివ్వలేదు అలాగే హీరో వీరభద్రకు ‘భాయ్’ ప్లాప్ తర్వాత చాన్నాళ్లు కోలుకోలేకపోయారు. తాజాగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ చిత్రం పై సర్వశక్తులు ఒడ్డుతున్నారు.అటు హీరోకుండాల్సిన అన్ని అర్హతల్ని అక్షరాలా పుణికి పుచ్చుకున్న ఆది…సరైన కథ..కథనం…పడితే దూసుకు పోవడం ఖాయమే…సక్సెస్ కోసం వీరిద్దరూ కసిగా చేస్తున్న ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం!

అదే విధంగా ఈ’ చుట్టాలబ్బాయి’లో ఓ విశేషం కూడా ఉందండోయ్…మొదటిసారి కొడుకు ఆదితో కలిసి ‘సాయి కుమార్ ‘ స్క్రీన్ పంచుకోబోతున్నారు.తెరపై తండ్రీ కొడుకుల విన్యాసాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Reply