చుట్టాలబ్బాయి రివ్యూ…

316
Spread the love

  chuttalabbayi review

చిత్రం : చుట్టాలబ్బాయి (2016)
నటీనటులు : ఆది, నమితా ప్రమోద్‌
సంగీతం : ఎస్‌.తమన్‌
దర్శకత్వం : వీరభద్రమ్‌
నిర్మాతలు : రామ్‌ తలారి,  వెంకట్‌ తాళ్లూరి
రిలీజ్ డేట్ : 19 ఆగస్టు, 2016

వస్తూ వస్తూనే ‘ప్రేమ కావాలి’ కి అనేశాడు హీరో ఆది. యూత్ ఫుల్ గా ఉండటంతో ఆది ‘ప్రేమ కావాలి’ ప్రేక్షకుల మద్దతు లభించింది. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల ప్రేమని పొందిన ఆది.. ఆ తర్వాత ‘లవ్ లీ’తో ఫర్వాలేదనిపించాడు. చూస్తూంటే ఆది టాలీవుడ్ లో చిన్న సినిమాలకి పెద్ద హీరోగా మారబోతున్నాడా ? అనే  ఆశలు కలిగాయి యి. ‘గాలిపటం’తోనూ మంచి మార్కులే కొట్టేశాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన రఫ్, గరం బాక్సీఫీస్ దగ్గర ఘోరంగా బోల్తాపడ్డాయి. దీంతో.. ఈ లవ్ లీ హీరోకి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. అందుకే ‘చుట్టాలబ్బాయి’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

కామెడీ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి  దర్శకత్వంలో ఆది-నమితా ప్రమోద్ జంటగా నటించిన చిత్రం చుట్టాలబ్బాయి. సాయి కుమార్ ఓ పవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ లలో సాయి డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి.. ‘చుట్టాలబ్బాయి’ ప్రేక్షకులకి నచ్చేశాడా.. ? ఇంతకీ చుట్టాలబ్బాయి కథేంటీ ? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

సినిమాలో కామెడీ పండితే హిట్టు కిందే లెక్క. ప్రేక్షకుడికి కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్‌. రెండు గంటల పాటు కాలక్షేపం అయిపోతే చాలు. అలా అయితే,  ప్రేక్షకుడు లాజిక్కు, మేజిక్కులని ఏ మాత్రం పట్టించుకోడు. ఇలా వినోదాన్ని నమ్ముకొనే ‘అహనా పెళ్లంట’.. ‘పూల రంగడు’ చిత్రాలతో హిట్ కొట్టాడు. మరోసారి, వినోదాన్ని నమ్ముకొని ‘చుట్టాలబ్బాయి’ని తీసుకొచ్చాడు వీరభద్రమ్. మరి.. వీరభద్రమ్ కామెడీ వర్కవుట్ అయ్యిందా.. ? ఆది ఖాతాలో మరో హిట్ పడినట్టేనా తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం పదండీ..

కథ :
ఓ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌ గా పని చేస్తుంటాడు బాబ్జీ (ఆది). ఏసీపీ కమ్‌ ఎన్కౌంటర్  స్పెషలిస్టు అభిమన్యుసింగ్‌. ఆయనకి ఒక్కగానొక్క చెల్లెల్లు  కావ్య (నమిత ప్రమోద్‌). ఓ సందర్భంలో తారస పడ్డ బాబ్జీ-కావ్యలు మాట్లాడుకోవడం చూసి ప్రేమించుకొంటున్నారని భ్రమపడుతాడు ఏసీపీ. ఏకంగా ఇంటి నుంచే పారిపాయే ప్లాన్ చేస్తోంది కావ్య. పారిపోయే క్రమంలో అనుకోకుండా బాబ్జీ తారస పడటంతో..వీరిద్దరు కలసి జంప్ అని పోలీసులు భావిస్తారు. పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో ఉన్న కార్తీ వెంట మరో ముఠా కూడా పడుతుంది. ఈలోపు దొరబాబు (సాయి కుమార్) ఈ జంటని కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ.. ఈ దొరబాబు ఎవరు ? కార్తీ ఎందుకు ఇంటి నుండి పారిపోవాలని చూసింది.. ?? ఆమె వెంట పడ్డ మరో ముఠా ఎవరు… ??? అనుకోకుండా కార్తీ వ్యవహారంలో చిక్కుకొన్న బాబ్జీ ఎదుర్కొన్న సమస్యలేంటీ ? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :
* ఫస్టాఫ్
* ఈగో రెడ్డి
* సాయి కుమార్

మైనస్ పాయింట్స్ :
* స్టోరీ
* సెకాండాఫ్
* క్లైమాక్స్
* బలమైన విలన్ లేకపోవడం

నటీనటుల పర్ ఫామెన్స్ :
దర్శకుడు వీరభద్రమ్ ఈసారి వినోదాన్నే నమ్ముకొన్నాడు. సాదాసీదా కథే. కాకపోతే.. కథని నడిపించిన విధానం ఆకట్టుకొంది. అయితే, ఫస్టాఫ్ లోని నవ్వులు  సెకాండాఫ్ లో కనిపించవు. ఆ నవ్వుల లోపాన్ని సాయికుమార్ పాత్ర కొద్దిగా కవర్ చేసింది. 30 ఇయర్స్ పృధ్వీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈగో రెడ్డి పాత్రలో భలే నవ్వులు పూయించాడు. సెకండాఫ్ లో కూడా ఈ పాత్రని అదే రేంజ్ లో ప్రజెంట్ చేస్తే ఇంకా బాగుణ్ను. ఆది ఫర్వాలేదనిపించాడు. కామెడీ టైమింగ్ బాగుంది. ఇక, సాయికుమార్ దొరబాబు పాత్రని చాలా ఈజీగా చేశాడు. సాయిపలికే ఒకట్రెండు డైలాగ్స్ కి థియేటర్ లో చంపట్లు పడ్డాయి. హీరోయిన్ నమితా ప్రమోద్ ని చూడటం కష్టం. ఇక, మిగితా వారు వారి వారి పరిథిలో బాగానే చేశారు.

సాంకేతిక విభాగం :
కెమెరా పనితనం బాగుంది. దాంతో సినిమాకి రిచ్ నెస్ వచ్చింది. థమన్ పాటల్లో రబ్బా.. రబ్బా బీట్ ఆకట్టుకొంటోంది. నేపథ్య సంగీతంలోనూ థమన్ మార్క్ కనిపించింది. సినిమాకి ఇంకాస్త కత్తెర పెట్టాల్సి ఉంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయనిపిస్తోంది.  సాంకేతికంగా సినిమా రిచ్ లుక్ కనిపిస్తోంది.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
మొత్తంగా.. లాజిక్కులు, మేజిక్కులు ఆలోచించకుండా కాస్త నవ్వులు కోరుకునే వారు ‘చుట్టాలబ్బాయి’ చూడ్డానికి వెళ్లొచ్చు.
బాటమ్ లైన్ : ‘చుట్టాలబ్బాయి’తో జస్ట్ టైంపాస్

రేటింగ్ : 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here