పట్నం …పల్లె తేడా తెలుస్తోంది ..!

Posted November 14, 2016

city people troubled with 500 1000 rs banned but village people not troubled

 

పెద్ద నోట్ల రద్దు పట్నాల్లో జనాన్ని మాత్రం అష్ట కష్టాల పాలు చేస్తోంది అనడంలో సందేహం లేదు. సహజం గానే పల్లెల్లో పెద్ద నోట్ల చెలామణి తక్కువగా ఉంటుంది .తాజాగా పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేయడం వల్ల మరికొంచెం చలామణి తగ్గింది .అంతేకాదు ఉన్న ఊరు కన్న తల్లి అనే నానుడి పల్లెలకు మాత్రమే సరిపోతుంది పట్టణాల విషయాన్ని కొస్తే భిన్నమైన వాతావరణం ,అంతా ఆర్ధిక సంబంధాలే ,పొట్ట చేత పట్టుకొని బ్రతుకు తెరువు కోసం వచ్చినవాళ్ళే వుంటారు .

హైదరాబాద్, బెంగళూరు ,చెన్నై ,కొలకత్తా, ఢిల్లీ ,గుర్గావ్ వంటి పట్టణాల్లో డబ్బు లేకపోతె గుక్కెడు నీళ్లు కూడాదొరికే పరిస్థితి ఉండదు.అన్ని ఉన్నా అల్ల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది ప్రస్తుతం పట్నం వాసుల పరిస్థితి . జేబు నిండా, బ్యాంకు అకౌంట్ లో దండిగా డబ్బు ఉన్నా తీసుకొనివాడుకోలేని పరిస్థితి వుంది. పల్లెల్లో లాగా అడక్కుండా అన్నం పెట్టె సంస్కృతి దాదాపు తక్కువే , ప్రభుత్వం వెసులు బాటు కల్పించిన రోజుకి నాలుగువేల స్కీం ని కూడా దాదాపు ప్రజలు వాడేశారు ఫలితం బ్యాంకు లో డబ్బు ఖాళీ …

ఇక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్‌ వద్ద మొరపెట్టుకున్నట్టుగా ప్రభుత్వాల ఆదాయం పడిపోతుంది. నల్లధనం పుణ్యమా అని వ్యాపారాలు మూడు పువ్వులు- ఆరు కాయలుగా విలసిల్లుతున్నాయి. పెద్దనోట్ల రద్దువల్ల గ్రామీణుల జీవితాలలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే వారి దగ్గర నల్లధనం ఉండదు. అవినీతికి పాల్పడే అవకాశం కూడా వారికి ఉండదు. సమస్య అంతా పట్టణప్రాంతాలకే ఉంటుంది.

నోట్ల రద్దు నిర్ణయం తర్వాత హైదరాబాద్ మహానగరం బోసిపోయింది షాపింగ్‌మాల్స్‌ కొనుగోలుదారులు లేక వెలవెల బోతున్నాయి . సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మినహా మిగతా వర్గాలంతా లావాదేవీలన్నీ నగదుతోనే చేస్తూఉంటారు. చెలామణిలో ఉన్న కరెన్సీలో 85 శాతం రద్దుకావడంతో ప్రజానీకం ఇప్పుడు కరెన్సీ కొరత ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులలో అత్యవసరాలకు మినహా ఖర్చుచేయలేని పరిస్థితి.

రియల్‌ఎస్టేట్‌ రంగం గురించి చెప్పనక్కర్లేదు. ఈ రంగంలో లావాదేవీలలో సగభాగం నగదు రూపంలోనే ఉంటాయి. ఇప్పుడు ఆ నగదే లేదు కనుక కొనేవాడే కరువయ్యాడు. దీని పర్యవసానంగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కుదేలవుతోంది. నిర్మాణరంగం దెబ్బతింటే దాని ప్రభావం సిమెంట్‌ పరిశ్రమపై పడుతుంది. నిర్మాణరంగంపై ఆధారపడి బతికే వారికి ఉపాధి కరువవుతుంది. ముఖ్యమంత్రి ఫీల్ ఐయ్యే విషయం లో విషయం ఉన్న, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోక తప్పదు కదా మరి . అంతా మన మంచికే అని సరిపెట్టుకోవడం మినహా ప్రస్తుతం చేసేదేం లేదు అనేది చేదు నిజం ….

SHARE