చూసుకుందాం..రా

 Posted March 24, 2017

clash between chevireddy bhaskar reddy and chintamaneni prabhakar challenge together in ap assembly
ఏపీ అసెంబ్లీ లో అధికార ,ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజుకుంటూనే వుంది.విమర్శలు,ప్రతివిమర్శలు దశ దాటి సవాళ్ల దాకా వెళ్ళింది సీన్.రెండు పార్టీల్లో ఫైర్ బ్రాండ్ లుగా పేరు పడ్డ ఎమ్మెల్యేలు చూసుకుందాం రా అంటూ ఒకరినొకరు ఢీకొట్టే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు మీద వున్న ఓటుకునోటు కేసులో సుప్రీమ్ కోర్ట్ నోటీసులు ఇచ్చిన అంశం మీద చర్చకు వైసీపీ పట్టుబట్టడంతో వివాదం మొదలైంది.వైసీపీ సభ్యుల డిమాండ్ ని తప్పుబడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇవ్వడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు.చెవిరెడ్డికి అండగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి కూడా గొంతు కలపడంతో పరిస్థితి ఇంకాస్త హీట్ ఎక్కింది.ఒకరిపైకి ఇంకొకరు దూసుకెళ్లేందుకు ఈ గొడవ పడుతున్న ఎమ్మెల్యేలు ప్రయత్నించారు.టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ,ప్రభాకర్ చౌదరి కలిసి చెవిరెడ్డిని ఆపారు.మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు చింతమనేనిని ఆపడంతో అది గొడవకి దారితీయకుండా ఆగిపోయింది.

SHARE