నిమిషానికో అంశం ..గురువుకి నృత్యాభిషేకం

0
625
classical dance show

classical dance showనాలుగు గంటలు.. ..264 మంది నృత్యకారులు …నిమిషానికో నృత్య ప్రదర్శన.. ఈ అరుదైన ప్రదర్శనకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికైంది. రాధామాధవ రసరంజని ఆధ్వర్యంలో సాగే నెలనెలావెన్నెల కార్యక్రమంలో భాగమే ఈ అద్భుత కళాప్రదర్శన ..

తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో నమోదైన ఈ ప్రదర్శన ఓ గురువుకి జరిగిన నిజమైన నృత్యాభిషేకం. ఇందులో పాల్గొన్న 264 మంది ప్రముఖ నాట్యాచార్యులు ఎస్.కె.ఖలీల్ శిష్యప్రశిష్యులు కావడం విశేషం. ఆ ప్రదర్శనతోఅద్భుత గురుదక్షిణ అందుకున్న ఖలీల్ పరవశించిపోయారు. నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సత్కరించారు.

Leave a Reply