పెళ్లి చేసినందుకు ఆ సీఎం బ్రోకర్ అన్నాడు..

 Posted October 27, 2016

cm akhilesh yadav said broker to amar singh
ఎస్పీ లో రాజకీయ సంక్షోభానికి కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్ ఎట్టకేలకు నోరు విప్పాడు.తనని బలిస్తే సంక్షోభం చల్లారిపోతుందనుకుంటే అందుకు సిద్ధమని కూడా చెప్పాడు.యూపీ సీఎం అఖిలేష్ పెళ్ళికి సంబంధించి కూడా ఓ గుట్టు విప్పాడు.ఆ పెళ్లి ములాయం కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేకపోయినా తానే వారిని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించినట్టు అమర్ అన్నాడు.తాను లేకపోతే అఖిలేష్ పెళ్లి జరిగేది కాదన్న అమర్ అతను నన్ను బ్రోకర్ అనడం బాధించిందన్నాడు.తనను చంపుతానని రామ్ గోపాల్ యాదవ్ బెదిరించినట్టు అమర్ ఆరోపించాడు.అయన తాజా వ్యాఖ్యలతో ఎస్పీ ముసలం ఆగలేదని అర్ధమవుతోంది.

SHARE