వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన..

whatsapp-image-2016-09-24-at-9-05-19-pm

జిల్లాలో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. పెదనందిపాడు, పముడివారిపాలెం, బాపట్ల, కాకనూరు ప్రాంతాల్లో వరద నష్టాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో రెడ్డిగూడెంలోని రహదారిపైనే హెలికాప్టర్‌ను దించారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. రెడ్డి గూడెం ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు పూర్తిగా మునిగిపోయి ఉండటాన్ని గమనించిన చంద్రబాబు అక్కడే ల్యాండ్ చేయాలని పైలట్‌ను ఆదేశించారు. అక్కడ్నుంచి జిల్లా కలెక్టర్ కారులో చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

whatsapp-image-2016-09-24-at-9-05-24-pm

SHARE