చంద్రబాబు రిచ్ సీఎం… మరి కెసిఆర్ .?

 cm chandrababu rich kcr poor than chandrababu

తెలుగు రాష్ట్రాల సీఎంలు…అన్నింటా పోటీ పడుతున్నారు. (అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్‌ లెక్కల ప్రకారం ఏపీ సీఎం ఆస్తుల్లో టాప్ ప్లేస్ లో ఉండగా… తెలంగాణ సీఎం…అందరి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న జాబితాలో ఉన్నారు.

నాలుగైదు రోజులుగా దేశంలోని మంత్రులు, వారి ఆస్తులు, జీతాల వివ‌రాల‌తో ఓ రేంజ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఏడీఆర్‌ సంస్థ తాజాగా దేశంలోని ముఖ్యమంత్రుల స్థిర, చ‌ర ఆస్తుల‌ను ప్రక‌టించింది.పేల్చింది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విప‌క్షాల‌కు మంచి వెప‌న్ దొరికిన‌ట్ట‌యింది. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆస్తుల‌ను కూడా ఏడీఆర్ ప్ర‌క‌టించింది. మొన్నటికి మొన్న ఏపీ మునిసిప‌ల్ శాఖ మంత్రి పొంగూరి నారాయ‌ణ ఆస్తులు వెల్ల‌డించి..

దేశంలో అత్యధిక సంప‌న్నుడైన మినిస్ట‌ర్‌గా ప్రక‌టించింది.డు సీఎం చంద్రబాబుదేశంలోని అత్యధిక సంప‌న్నులైన ముఖ్యమంత్రుల్లో.. ముందు వ‌రుస‌లో ఉన్నారు సంస్థ నివేదిక ప్రకారం చంద్రబాబుకు 134 కోట్ల 80 లక్షల 11 వేల 728 రూపాయల చరాస్థులు, 42 కోట్ల 68 లక్షల 83 వేల 883 రూపాయల స్థిరాస్తులున్నాయి. ఇది, దేశంలోని ముఖ్య‌మంత్రుల ఆస్తుల్లో ఎక్కువ‌ని స‌ర్వే పేర్కొంది.

ఇక‌, రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పెమాఖండు ఉన్నారు. ఈయ‌న ఆస్తి రూ. 129 కోట్ల 57 లక్షల 56 వేల 14 రూపాయలుగా ఏడీఆర్ తేల్చింది. అదేవిధంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఒక‌టైన త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత ఆస్తులు 113 కోట్ల 73 లక్షల 38 వేల 586 రూపాయలు. దీంతో ఆమె మూడో ప్లేస్‌లో ఉన్నారు. గత సాధారణ ఎన్నికలకు ముందు అభ్యర్థులు అందచేసిన అఫిడవిట్‌లను అధ్యయనం చేసి ఈ నివేదిక‌ల‌ను రూపొందించింది ఏడీఆర్‌. అయితే, ఇక్కడ ఆస‌క్తి క‌ర విష‌యం ఏంటంటే.. ముఖ్యమంత్రుల జీతాల్లొ దేశంలోనే అత్యధికంగా 4.21 ల‌క్షలు తీసుకుంటున్న లిస్ట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు..

SHARE