అక్కడ బంగారాన్ని కడిగేస్తారు..

0
465

 cm chandrababu said gold cleaning company krishna districtకృష్ణా జిల్లా ప్రపంచ ప్రసిద్ధి చెందిన బంగారు శుద్ధి కేంద్రానికి కేరాఫ్ చిరునామగా నిలవబోతోంది. ప్రతిష్టాత్మకమైన బంగారు శుద్ధి కేంద్రాన్ని కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం రూ. 7330 కోట్లతో వివిధ కంపెనీల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు ప్రాజెక్టులు గ్రీన్ సిగ్నల్ తెలిపారు. విజయవాడలో బంగారు శుద్ధి కర్మాగారంతోపాటు అనంతపురంలో ఎయిరోస్పేస్ క్లస్టర్ ఏపీకి తలమానికంగా నిలవనున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం ద్వారా కొత్తగా పది వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బంగారు శుద్ధి కేంద్రం రూ. 87 కోట్ల పెట్టుబడితో ఇందాని గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తోంది. దేశంలో 32 బంగారు శుద్ధి కేంద్రాలున్నప్పటికీ 27 కేంద్రాల్లో శుద్ధి బంగారం తయారు చేసే వసతులు లేనివే ఉన్నాయి. బంగారు అభరణాల వర్తకులకు శుద్ధి చేసిన బంగారాన్నే ప్రధానంగా వినియోగిస్తారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయాలను భావిస్తున్న పరిశ్రమతో కృష్ణా జిల్లాకు బంగారు మణిహారం ఆకర్షణగా నిలవబోతోంది.
ప్రత్యేక పెట్టుబడుల ఆకర్షణ బోర్డు (స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) ఆయా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలను అందించనుంది. యారో కేబుల్ సంస్థ రూ. 510 కోట్లతో అత్యాధునిక కేబుల్ పరిశ్రమను కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయబోతోంది.

ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ఇందుకు భూకేటాయింపులు ఖరారు చేసింది. కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయదలపెట్టిన పరిశ్రమలతో 500 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆయా కంపెనీలకు మౌలిక సదుపాయల కల్పన చేయాలని సర్కారు నిర్ణయించింది. కొత్తగా స్థాపిస్తున్న కంపెనీలు ప్రభుత్వం నుంచి ఎలాంటి భూములను తీసకోకపోవడం విశేషం. కంపెనీలు ప్రైవేటు వ్యక్తుల భూములను కొనుగోలు చేశాయి. కంపెనీలు కెమిల్, ఫైబర్, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్, ఇతర పరిశ్రమలను చిత్తూరు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి.

అనంతపురం జిల్లాలో ఎయిర్ స్పేస్, డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు వీలు కలుగుతోంది. ఎనై ్లవినింగ్ టెక్నాలజీ ప్రైవేటు కంపెనీ రూ. 570 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల 650 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు వివరించారు. ఉత్తరాదిన ప్రసిద్ధి చెందిన సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ పునరుత్పాదక విద్యుత్ ఉపకరణాలు సోలార్ ప్యానల్స్, విండ్ టరై ్బన్లకు ఉపయోగించే బ్లేడ్ల ఉత్పత్తి చేయనుంది. ఊ ప్రాజెక్టు వ్యయం రూ 545 కోట్లు. ఈ ప్రాజెక్టు వల్ల 2500 ఉద్యోగాల కల్పన జరుగుతుంది.

డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిడెట్ కంపెనీ విశాఖపట్టణంలో రూ.1200 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది.ఈ వెంచర్‌ను సుప్రసిద్ధ ఎల్రక్టానిక్ ఉపకరణాల దిగ్గజం మిత్సుబషితో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ పరిశ్రమతో 400 ఉద్యోగాలు లభిస్తాయి. విజయనగరం జిల్లాలో కొత్తవలస ఇన్ ఫ్రా వెంచర్స్ కంపెనీ రూ. 2500 కోట్లతో రూపొందనుంది. ఈ కంపెనీ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసి 2 వేల మంది యువతకు ఉద్యోగాలను అందించే ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.నెల్లూరు జిల్లాలో భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీ రూ. 1400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుంది.

ఈ కంపెనీ ఏర్పాటుతో 3645 ఉద్యోగాల సృష్టించడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ కంపెనీ కోసం ఏపీఐఐసీ భూమిని కేటాయించింది. చిత్తూరు జిల్లాలో రీన్ ప్లే ఇండ్రస్టీస్ లిమిటెడ్ రూ. 758 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. ఈ కంపెనీ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు ఉత్పత్తి చేస్తోంది. దీంతోపాటు చిత్తూరు జిల్లాలో సీసీఎల్ (ఇండియా) కంపెనీ రూ. 260 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేయనుంది.

Leave a Reply