చెన్నైలో సైబర్ యుద్ధం..రంగంలో ఆ పార్టీ సైన్యం

Posted October 4, 2016

 chennai cyber war
వాట్స్ అప్ ,ఫేస్ బుక్,ట్విట్టర్ …ఇలా సోషల్ మీడియా అందుబాటులో వుంది కదాని తమిళనాడు ముఖ్యమంత్రి జయ ఆరోగ్యంపై ఇష్టమొచ్చినట్టు రాసినోళ్లంతా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి 40 మందిపై చెన్నై పోలీసులు కేసులు నమోదు చేశారు.వదంతులు పుట్టించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.సోషల్ మీడియా సర్వర్లు అమెరికాలో ఉన్నందున నిందితుల్ని గుర్తించడం కాస్త ఆలస్యమవుతోందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అయితే ఈ కేసుల్లో బుక్ అయినవారంతా డీఎంకె కార్యకర్తలు,అభిమానులే.వారిపై వచ్చిన 40 ఫిర్యాదులు చేసిన వాళ్ళు అన్నాడీఎంకే కార్యకర్తలే.సోషల్ మీడియా లో జయ ఆరోగ్యం మీద ఏ కాస్త నెగటివ్ కామెంట్ చేసినా అన్నాడీఎంకే సాంకేతిక సైన్యం రంగంలోకి దిగుతోంది.వెంటనే సదరు పోస్ట్ చేసినవారి వివరాలు రాబట్టి పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఆ పార్టీ.ఈ సైబర్ యుద్ధమే కాదు అమ్మ కోసం ఏమైనా చేస్తామంటున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు.

SHARE