భయం లేదంటూనే బతిమిలాడిన సి.ఎం.రమేష్ .

0
498

cm ramesh arun jaitley venkayya naidu
ప్రత్యేకహోదా అంశంలోప్రైవేట్ బిల్లుకు మద్దతు అన్న టీడీపీ రాజ్యసభలో ఆ స్థాయి దూకుడు ప్రదర్శించలేకపోయింది.ముఖ్యంగా సీమాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న సి.ఎం.రమేష్ తేలిపోయారు .బీజేపీ తరపున నాడు డిమాండ్ వినిపించిన వెంకయ్య ,అరుణ్ జైట్లీ లను ఆయన వెనుకేసుకొచ్చారు . వారిద్దరివల్లే ఇవాళ సభలోచర్చకు అవకాశమైనా లభించిందన్నారు .

మోడీకి చంద్రబాబు భయపడబోరని చెప్పేందుకు రమేష్ ప్రయత్నిచారు.ఆ మాట చెప్పిన ఆయన అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధమన్న మాట చెప్పలేకపోయారు. పదే పదే హామీల అమలుకు విజ్ఞప్తి మాత్రం చేయగలిగారు.ప్రత్యేక హోదా కోసం ప్రార్ధిస్తున్నామంటూ ప్రసంగాన్ని చేతులు జోడిస్తూ ముగించారు .

Leave a Reply