సుజనా,రమేష్ ఇంకా మభ్యపెట్టొద్దు ..

  cm ramesh sujana chowdary stop nonsense words

ప్రత్యేక హోదా…ప్యాకేజ్ ….ఈ రెంటిలోదేనివైపు మొగ్గాలన్నది కేంద్రం ఎప్పుడో నిర్ణయించుకుంది .ప్యాకేజ్ పై కసరత్తు పూర్తి చేసి మరి కాసేపట్లో ప్రకటన కూడా ఇవ్వబోతోంది .ఈ టైములో కేంద్రమంత్రి సుజనా చౌదరి ,దేశం ఎంపీ సి.ఎం.రమేష్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా వుంది.కేంద్రం ఆంధ్రాకి ప్రత్యేక హోదా,ప్యాకేజ్ ఏది ఇవ్వాలా అని తర్జనభర్జన పడుతోందని వాళ్ళు చెప్పడం సమంజసంగా లేదు .

దేశం సర్కార్ సైతం ప్యాకేజ్ కి ఓకే అన్నట్టే ప్రవర్తిస్తోంది .కాకుంటే ప్రతి విషయంలో కేంద్రం ప్రతిపాదిస్తున్న దానికన్నా కాస్త ఎక్కువ రాబట్టే ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబులో కనిపిస్తోంది.ఈ సమయంలో కేంద్రం ఇంకా హోదా గురించి ఆలోచిస్తోందని చెప్పడం ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడమే .విభజనకి ముందు ఉండవల్లి ,రాజగోపాల్ ,కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి మాటలు చెప్పి టెంపరరీ హీరోలుగా తరువాత జీరోలుగా మిగిలిపోయారు.కళ్ళ ముందు జరిగింది చూసి కూడా ఇంకా ప్రజల్ని భ్రమల్లో ఉంచాలని చూస్తే అదే పరిస్థితి ఎదురవుతుంది .

SHARE