Posted [relativedate]
నగదు రహిత లావాదేవీలు, జన్మభూమిపై ముఖ్యమంత్రి టెలి కాన్ఫరెన్స్
- పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు
- కొత్త సంవత్సరంలో కొత్తమార్పుకు నాంది పలకాలి, మార్పు లేనిదే అభివృద్దిలేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఫిజికల్ కరెన్సీ నుంచి డిజిటల్ కరెన్సీకి, మొబైల్ కరెన్సీకి దేశం మారుతోంది, ఈ మార్పును అందరూ అందిపుచ్చుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
- కనిష్ట నగదుతో గరిష్ట లావాదేవీలు జరగాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఆధార్ చెల్లింపులు,ఫ్యూచర్ ఫోన్, కార్డు స్వైపింగ్, కనీస నగదు వినియోగం ద్వారా సమస్యను అధిగమించాలి: సీఎం చంద్రబాబు
- భౌతిక నగదుకన్నా డిజిటల్ కరెన్సీ ద్వారా పారదర్శకత వస్తుంది, అవినీతి తగ్గుతుంది,ఉపాధి పెరుగుతుంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
- ప్రజలకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలి, బ్యాంకర్లు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పటిష్టం చేసుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
- తీవ్రఒత్తిడి నడుమ బ్యాంకర్లు పనిచేస్తున్నారు, వారికి అందరూ సహకరించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
- తక్కువ వ్యవధిలో బ్యాంకర్లు అద్భుత పనితీరు కనబరిచారు, అందుకు వారిని అభినందించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
- సమస్య వదిలిపెట్టి పక్కదారి పట్టడం కరెక్టుకాదు, సమస్యల్లో ప్రజలకు అండగా ఉండాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
- ప్రజలతో, ప్రసార మాధ్యమాలతో సత్సంబంధాలు కలిగిఉండాలి: అధికారులతో సీఎం చంద్రబాబు
- పెన్షన్ల చెల్లింపులు, రైతుల చెల్లింపులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు
- ఈవారంలో ఆన్ లైన్ లావాదేవీల సగటు 23%ఉంది, దీనిని మార్చినాటికి 50%కు తీసుకెళ్లాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
- పోస్ మిషన్ల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో కృష్ణా జిల్లా దేశానికే మార్గదర్శకం అయ్యింది: ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఇదే స్ఫూర్తితో విజయవాడ నగరం మొత్తం నగదురహితంగా మారాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
- మోరి గ్రామం, ధర్మసాగరం గ్రామం స్ఫూర్తిగా ప్రతి గ్రామం నగదురహితంగా రూపొందాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
- ప్రజలకు లబ్ధి చేకూర్చడం, ఫిర్యాదులు స్వీకరించడం, జవాబుదారీతనం పెంచడం, ప్రజల వద్దకు ప్రభుత్వ పాలన జన్మభూమి కార్యక్రమం ప్రధాన లక్ష్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు
- జన్మభూమిలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేయాలి, మరో 4లక్షలు పింఛన్లు కొత్తగా మంజూరుచేశాం,చంద్రన్న బీమా అందిస్తున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
- జన్మభూమిలో వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు