కేబినెట్ మీటింగ్ నుంచి సీఎం వాకౌట్!!

0
220
cm walkout from cabinet meeting
Rajnath Singh, with Chief Minister Mehbooba Mufti walk out of Press conference after facing tough questions in Gupkar srinagar.Express photo Shuaib Masoodi 25-08-2016

Posted [relativedate]

cm walkout from cabinet meeting

వాకౌట్ అంటే అర్థాంత‌రంగా అక్క‌డ్నుంచి వెళ్లిపోవ‌డం. ముఖ్యంగా అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ మాట‌ను వింటాం. సాధార‌ణంగా ప్ర‌తిప‌క్షాలు ఇలా వాకౌట్ చేసి వెళ్లిపోతుందటాయి. అలాంటిది కేబినెట్ మీటింగ్ నుంచి ముఖ్య‌మంత్రి వాకౌట్ చేస్తే అది పెద్ద వార్తే. అదీ కాశ్మీర్ లో జ‌రిగిందంటే మీడియాకు అది హాట్ న్యూసే.

పాకిస్తాన్- భార‌త్ మ‌ధ్య ఒక‌ర‌కంగా యుద్ధ వాతావ‌ర‌ణం న‌డుస్తోంది. ఈ స‌మ‌యంలో జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యిందంటే కీల‌కాంశాలు చ‌ర్చ‌కు రావ‌డం మామూలే. సీఎం మ‌హ‌బూబా ముఫ్తీ అధ్య‌క్ష‌త‌న మీటింగ్ మొద‌లైంది. కేబినెట్ లో బీజేపీకి చెందిన మంత్రులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం నిర్మ‌ల్ సింగ్ క‌మ‌లం పార్టీకి చెందిన వాడే. ఇక భేటీ ప్రారంభం కావడ‌మే ఆల‌స్యం… క‌శ్మీర్ పోలీస్ పోలీస్ స‌ర్వీస్- కేపీఎస్ ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించాల‌ని ముప్తీ నిర్ణ‌యించార‌ట‌. ఈ అంశం ప్రస్తావ‌న‌కు రాగానే నిర్మ‌ల్ సింగ్ స‌హా బీజేపీకి చెందిన మంత్రులంతా ఆ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించార‌ట‌. మొద‌ట సున్నితంగా చెప్పినా… లాభం లేక‌పోవ‌డంతో ముఫ్తీకి ఆగ్ర‌హం వ‌చ్చింద‌ని స‌మాచారం. కేబినెట్ లో బీజేపీ, పీడీపీ మంత్రుల మ‌ధ్య ఈ విష‌యంలో స్వ‌ల్ప వాగ్వాదం కూడా జ‌రిగింద‌ట‌. దీంతో ఇక లాభం లేద‌నుకొని ముఫ్తీ అక్క‌డ్నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

సీఎం ముఫ్తీ వాకౌట్ చేసి వెళ్లిపోతార‌ని బీజేపీ మంత్రులు ఎక్స్ పెక్ట్ చేయ‌లేద‌ట‌. దీంతో వారంతా షాకై వెంట‌నే సీఎం నివాసానికి బ‌య‌లుదేరారు. అక్క‌డికెళ్లి ముప్తీని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశార‌ని చెబుతున్నారు. అయితే బీజేపీ- పీడీపీ మ‌ధ్య వార్ కు ఇది ఆరంభం అని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నార‌ట‌. ఇలాగుంటే ప్ర‌భుత్వం ఏం న‌డుస్తుంద‌ని ఎద్దేవా చేస్తున్నార‌ట‌. చూడాలి మ‌రి సీఎం వాకౌట్ అంశం ఎంతటి ర‌చ్చ‌కు తెర‌తీస్తుందో…

Leave a Reply